వారు రెండేళ్లుగా రిలేషన్షిప్లో ఉన్నారు. అయినప్పటికీ వారి మధ్య ఎలాంటి గొడవలు లేవు. ఇంతటి సుఖ శాంతులు ఆ యువకుడికి నచ్చలేదు. అతను తన ప్రేయసిని అనుమానించడం మొదలుపెట్టాడు. అవకాశం దొరికితే, తన ప్రేయసి వేరే పురుషుడితో గాఢమైన సంబంధాన్ని కొనసాగించవచ్చేమోనని అనుకున్నాడు. తన ప్రేయసి నిజంగా సంబంధంలో నిజాయితీగా ఉందో లేదో పరీక్షించడానికి ప్రయత్నించాలని యువకుడు అనుకున్నాడు. అందుకోసం ఒక స్నేహితుడికి ఆమెతో సరదాగా, ఫ్లర్టింగ్ మాటలు మాట్లాడమని సూచించాడు.
కానీ ప్రేయసి ఇచ్చిన జవాబు చూసి ఆ యువకుడు కోపంతో ఊగిపోయాడు. వారి సంబంధంలో బీటలు వచ్చాయి.
మీడియా వర్గాల సమాచారం ప్రకారం, ఆ యువతి పేరు లిసా (పేరు మార్చబడింది). ఆమె తన ప్రియుడు డాన్ (పేరు మార్చబడింది)తో రెండేళ్లుగా రిలేషన్షిప్లో ఉంది. అకస్మాత్తుగా ఒక అపరిచితుడు సోషల్ మీడియాలో లిసాకు మెసేజ్ పంపాడు. అతనితో మాట్లాడిన తర్వాత, అతను డాన్ స్నేహితుడు అని లిసా గ్రహించింది. కొన్ని రోజుల క్రితం ఒక కచేరీలో ఆ యువకుడితో లిసాకు పరిచయం కూడా అయింది. ప్రియుడి స్నేహితుడితో లిసా పరిమితులు పాటించి మాట్లాడింది.
కానీ ఆ యువకుడు సంభాషణ పరిధిని దాటేశాడు. అతను లిసా అందాన్ని పొగడటం ప్రారంభించాడు. లిసా మర్యాద పూర్వకంగా కేవలం ధన్యవాదాలు చెప్పి, ఆ సంభాషణను తప్పించుకుంది. కానీ ఆ యువకుడు ఊరుకునే వ్యక్తి కాదు. అతను లిసాకు ప్రేమపూర్వకంగా ఫ్లర్టింగ్ మెసేజ్‌లు పంపుతూనే ఉన్నాడు.
లిసా వాదన ప్రకారం, డానే తన స్నేహితుడిని ఈ పని చేయమని అడిగాడు. డాన్, లిసాను అనుమానించేవాడు. లిసా తన స్నేహితుడి మెసేజ్‌లకు జవాబిచ్చింది కాబట్టి ఆమె నిజాయితీగా లేదని డాన్ వాదించాడు. చాటుగా లిసా డాన్‌ను మోసం చేసిందని అన్నాడు. ఈ విషయంలో వారిద్దరి మధ్య గొడవ జరిగింది. లిసా తనను తాను నిరూపించుకోవడానికి ప్రయత్నించింది కానీ డాన్ ఎలాంటి మాట వినడానికి కూడా సిద్ధంగా లేడు. డాన్ ఎదురు దాడి చేస్తూ, లిసా తప్పు చేసింది కాబట్టే గట్టిగా మాట్లాడుతోందని అన్నాడు. మరోవైపు లిసా, తాను ఎలాంటి అపరిచితులతో మాట్లాడనని, చాలా సందర్భాలలో వారిని సోషల్ మీడియా పేజీల నుండి బ్లాక్ కూడా చేస్తానని చెప్పింది. కానీ డాన్ చేసిన ఈ పరీక్ష తనకు నచ్చలేదని తెలిపింది.
డాన్ లిసాతో, “నేను నీకు పరీక్ష పెట్టాను. నువ్వు ఆ పరీక్షలో ఉత్తీర్ణురాలివి కాలేదు” అని చెప్పాడట. వారిద్దరి సంబంధంలో కూడా బీటలు వచ్చాయి. ఈ సమయంలో ఏం చేయాలో తెలుసుకోవడానికి లిసా నెటిజన్ల సలహా కోరింది. ఆమె ‘r/TooHotTakes’ అనే ఖాతా నుండి రెడ్డిట్ పేజీలో పోస్ట్ చేసింది. అయితే, తరువాత ఆ యువతి పోస్ట్‌ను తొలగించింది. ఒక నెటిజన్ ఇలా రాశాడు, “నువ్వు నీ గౌరవాన్ని కాపాడుకుని ఈ సంబంధం నుండి బయటకు వచ్చేయ్. నీ ప్రియుడు నిన్ను కొంచం కూడా నమ్మడం లేదు. నమ్మకం లేని సంబంధం ఏదీ నిలబడదు.”
