ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకా సోషల్ మీడియా వేదికగా గల్గోటియాస్ యూనివర్శిటీపై విమర్శలు గుప్పించారు. యూనివర్శిటీ గొప్పలు చెప్పుకోవడానికి, వాస్తవానికి మధ్య ఉన్న భారీ వ్యత్యాసాన్ని ఆయన ఎత్తిచూపారు.
అసలేం జరిగింది? (రోబో డాగ్ వివాదం): ‘ఇండియా AI ఇంపాక్ట్ సమ్మిట్ 2026’లో గల్గోటియాస్ యూనివర్శిటీకి చెందిన ఒక ప్రొఫెసర్ నాలుగు కాళ్ల రోబోను ప్రదర్శించారు. దీనిని తమ యూనివర్శిటీకి చెందిన ‘సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్’లో అభివృద్ధి చేశామని, దీని పేరు ‘ఓరియన్’ (Orion) అని క్లెయిమ్ చేశారు. అయితే, నెటిజన్లు అది చైనాకు చెందిన ‘యూనిట్రీ గో2’ (Unitree Go2) మోడల్ రోబో అని, దానిని మార్కెట్‌లో ₹2-3 లక్షలకు కొనుగోలు చేయవచ్చని గుర్తించారు. దీంతో ఆ యూనివర్శిటీ స్టాల్‌ను ఖాళీ చేయాలని నిర్వాహకులు కోరారు.
పాత వివాదాల ప్రస్తావన: ఈ ఘటనపై హర్ష్ గోయెంకా స్పందిస్తూ.. “రోబోల విషయంలో వార్తల్లో నిలిచిన ఈ గల్గోటియాస్ యూనివర్శిటీనే, గతంలో గంటలు కొట్టడం లేదా ప్లేట్లు వాయించడం వల్ల వచ్చే ప్రకంపనలతో కరోనా వైరస్ చనిపోతుందని రీసెర్చ్ పేపర్ పబ్లిష్ చేసింది. తాము ఎక్కడ చదువుతున్నామో చెప్పుకోవడానికి సిగ్గుపడే ఆ యూనివర్శిటీ విద్యార్థుల పరిస్థితి తలచుకుంటే నా మనసు కలిచివేస్తోంది” అని X (ట్విట్టర్) లో పేర్కొన్నారు.
యూనివర్శిటీ వివరణ: వివాదం ముదరడంతో 2020 నాటి ఆ పరిశోధనా పత్రాన్ని యూనివర్శిటీ వెనక్కి తీసుకుంది. సాంకేతిక లోపం వల్ల తప్పుడు పేపర్ పబ్లిష్ అయ్యిందని, అది పాఠకులను తప్పుదోవ పట్టించేలా ఉందని పేర్కొంటూ క్షమాపణలు కోరింది.
