లడఖ్‌లో ఉంటూ ఆఫీసు పని.. సాయంత్రం వేళల్లో విహారం..! ఈ జంట ‘వర్క్ వెకేషన్’ ప్లాన్ వేరే లెవెల్.. మొత్తం ఖర్చు రూ.96,600.. పూర్తి లెక్క ఇదే..!!!

లడఖ్ అనగానే ఎత్తైన పర్వతాలు, నీలి ఆకాశం, అందమైన లోయలతో పర్యాటకులను విశేషంగా ఆకర్షించే ప్రదేశం.

ఈ నేపథ్యంలో, లడఖ్‌లో ఉంటూ తమ ఆఫీసు పనిని చేసుకుంటూనే పర్యటనను ఆస్వాదించిన ఓ జంట వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. వారు తమ ప్రయాణానికి సంబంధించిన పూర్తి ఖర్చుల వివరాలను పంచుకున్నారు.

‘వర్క్ వెకేషన్’ (Work Vacation) అంటే ఆఫీసుకు సెలవు పెట్టకుండా, ఏదైనా అందమైన ప్రదేశానికి వెళ్లి అక్కడి నుంచే పని చేయడం. పని వేళలు ముగిసిన తర్వాత ఆ ప్రాంతాన్ని చుట్టి రావడం దీని ప్రధాన ఉద్దేశం. దీనివల్ల సెలవులను ఆదా చేసుకోవడంతో పాటు, కొత్త ప్రదేశంలో నివసించే అనుభూతిని కూడా పొందవచ్చని ఈ జంట పేర్కొంది.

ఇన్‌స్టాగ్రామ్‌లో ‘@anjali.aur.naman’ అనే ఖాతాలో పంచుకున్న సమాచారం ప్రకారం, వీరిద్దరూ ఒక నెల రోజుల పాటు లడఖ్‌లో బస చేశారు. మొదట రూ.15,000 నుండి రూ.20,000 లోపు వసతి దొరుకుతుందని భావించినప్పటికీ, చివరికి ఒక నెల హోమ్‌స్టే (Homestay) కోసం రూ.30,000 ఖర్చయినట్లు తెలిపారు. ఆహారం, నిత్యావసర సరుకుల కోసం రూ.9,000, స్కూటర్ అద్దెకు రూ.2,100 ఖర్చయినట్లు వెల్లడించారు.

ఇవే కాకుండా లడఖ్ చుట్టుపక్కల ప్రాంతాల్లో చిన్నపాటి ప్రయాణాలకు సుమారు రూ.30,000 ఖర్చయింది. మనాలీ నుంచి లేహ్ (Leh) వెళ్లే ప్రయాణం, తిరిగి లేహ్ నుంచి ఢిల్లీకి విమాన ప్రయాణం తదితర ఖర్చులన్నీ కలిపి ఇద్దరికీ మొత్తంగా రూ.96,600 ఖర్చయినట్లు వారు తెలిపారు. ఈ ఖర్చు సరైనదేనా అని సోషల్ మీడియా వేదికగా నెటిజన్లను వారు ప్రశ్నించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *