లావణ్యను వదలని ప్రేమ.. కర్ణాటక బస్సు ఎక్కి కూర్చోగానే కరెక్ట్‌గా వచ్చిన వ్యక్తి! గుండె గుభేల్మనే క్షణాలు

బెంగళూరు: కర్ణాటక రాష్ట్రం బంత్వాల్ ప్రాంతంలో జరిగిన ఒక సంఘటన, స్థానిక ప్రజల మధ్య తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.

కల్లడ్కలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న లావణ్య, నిన్న డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించింది.. సరిగ్గా అప్పుడే ఈ ఘోరం జరిగింది. ఇంతకీ కర్ణాటకలో ఏం జరిగిందంటే?

కర్ణాటక రాష్ట్రంలోని దక్షిణ కన్నడ జిల్లా, కల్లడ్కలో ఉన్న ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో లావణ్య నర్సుగా పనిచేస్తోంది. 22 ఏళ్ల ఈమె, ప్రతిరోజూ డ్యూటీ ముగిసిన తర్వాత బంత్వాల్ ప్రాంతంలో ఉన్న ‘BC రోడ్ KSRTC’ బస్టాండ్‌లో బస్సు ఎక్కి ఇంటికి తిరిగి వెళ్లడాన్ని అలవాటుగా చేసుకుంది.

కర్ణాటక ప్రభుత్వ బస్సు: లావణ్యను అదే ప్రాంతానికి చెందిన చేతన్ అనే యువకుడు వెంటపడుతూ ప్రేమించాడు. ఇతడు లావణ్యకు దూరపు బంధువు అని చెబుతున్నారు. చాలా కాలంగా లావణ్యను ఏకపక్షంగా ప్రేమిస్తూ, ఆమెను నిరంతరం వెంబడిస్తూ ప్రేమ పేరుతో వేధించేవాడు.

కానీ, చేతన్ ప్రేమను లావణ్య తిరస్కరించింది. అంతేకాకుండా చేతన్‌తో మాట్లాడటం మానేసి, ఇకపై తనను ఇబ్బంది పెట్టవద్దని హెచ్చరించినట్లు తెలుస్తోంది. దీనిని చేతన్ తట్టుకోలేకపోయాడు. దీంతో తీవ్ర ఆవేశానికి లోనైన చేతన్, ఎలాగైనా లావణ్యను అంతమొందించాలని పథకం వేశాడు.

లావణ్యను వదలని ప్రేమ: నిన్న సాయంత్రం ఎప్పటిలాగే లావణ్య డ్యూటీ ముగించుకుని ఇంటికి వెళ్లేందుకు బస్టాండ్‌కు వచ్చింది. అక్కడ ఆగి ఉన్న కాగ్యపదవు వెళ్లే బస్సు ఎక్కి కూర్చుంది. ఆ సమయంలో ఒక బ్యాగ్‌ను దాచుకుంటూ అక్కడికి వచ్చిన చేతన్, బస్సు ఎక్కి లావణ్యతో మళ్లీ గొడవకు దిగాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య వాగ్వాదం ముదిరింది.

ఒక దశలో ఆవేశం తట్టుకోలేక, బ్యాగులో దాచి ఉంచిన కొడవలిని ఒక్కసారిగా బయటకు తీసి లావణ్యపై చేతన్ ఘోరంగా దాడి చేశాడు.

ఈ దాడితో హతాశురాలైన లావణ్య బస్సులోంచి కిందకు దూకి తప్పించుకోవడానికి ప్రయత్నించింది. కానీ, ఆమెను అక్కడి నుండి కదలనివ్వకుండా వెంబడించి మరీ నరికాడు. బస్టాండ్‌లోనే కాలుజారి కిందపడిపోయిన లావణ్యను అతడు కొడవలితో పదే పదే కిరాతకంగా నరికాడు. దీంతో లావణ్య రక్తపు మడుగులో అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.

గుండె గుభేల్మనే క్షణాలు: ఇది చూసి అక్కడున్న వారు భయాందోళనలకు గురై, వెంటనే లావణ్యను బంత్వాల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే, ఆసుపత్రికి తరలిస్తుండగానే మార్గమధ్యలోనే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు.

లావణ్యను దారుణంగా నరికిన చేతన్, కొడవలిని బస్టాండ్‌లోనే పడేసి అక్కడి నుండి పారిపోయాడు. ఆ తర్వాత బస్టాండ్‌లో ఉన్నవారు ఈ ఘటనపై బంత్వాల్ పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే రంగంలోకి దిగిన పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

మంగళూరు పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలాన్ని సందర్శించి పరిశీలించారు. హత్యకు పాల్పడిన నిందితుడిని పట్టుకోవడానికి ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి, ముమ్మరంగా గాలిస్తున్నారు.

పగటిపూట బస్టాండ్‌లో జరిగిన ఈ ఘోర సంఘటన, మహిళల భద్రతపై ప్రజల్లో ఉన్న భయాందోళనలను మరోసారి బలోపేతం చేసింది…!!!


Posted

in

by

Tags: