నాసిక్‌లోని టీసీఎస్ (TCS) కంపెనీలో లవ్ జిహాద్ ఆరోపణల తర్వాత, ఇప్పుడు ప్రముఖ ఐవేర్ కంపెనీ ‘లెన్స్‌కార్ట్’ (Lenskart) ఉద్యోగుల కోసం విధించిన కొత్త డ్రెస్ కోడ్ నిబంధనలు దేశంలోని హిందువులను విస్మయానికి గురిచేస్తున్నాయి. హిందూ ధర్మ సంప్రదాయ చిహ్నాలైన బొట్టు (బింది), సింధూరం, రక్షా బంధనం (చేతికి కట్టే దారం), తులసి మాల, రుద్రాక్షలు ధరించడంపై కంపెనీ ఆంక్షలు విధించింది. అయితే, ఇదే సమయంలో హిజాబ్ ధరించడానికి మాత్రం అనుమతినిచ్చింది.
ఈ నిబంధనల వెనుక ఉన్న అజెండా ఏమిటనే దానిపై ఇప్పుడు దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.
భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చాలనే లక్ష్యం: 2047 నాటికి, అంటే భారత్‌కు స్వాతంత్ర్యం వచ్చి 100 ఏళ్లు పూర్తయ్యే సమయానికి భారతదేశాన్ని ఇస్లామిక్ దేశంగా మార్చాలనేది పాకిస్థానీల పాత పన్నాగం. దీనిపై వారు ఇప్పటికే పలుమార్లు బహిరంగ ప్రకటనలు చేశారు. దీనికి ప్రతిగా, భారత్‌ను ‘హిందూ రాష్ట్రం’గా ప్రకటించాలని ప్రధాని సహా పలువురు కృషి చేస్తున్నారు. ఇది పాకిస్థానీలకు మింగుడు పడటం లేదు. భారతదేశం నుండి కూడా కొంతమంది ప్రోత్సాహం అందిస్తుండటంతో వారు తమ ప్రయత్నాలను విరమించడం లేదు.
ఎవరీ నాజియా ఖాన్? సుప్రీంకోర్టు న్యాయవాది, బీజేపీ నేత నాజియా ఖాన్ లెన్స్‌కార్ట్ కంపెనీకి వెళ్లి, అక్కడ హిందువులపై జరుగుతున్న మతపరమైన వేధింపులను ఖండించారు. అక్కడ ఉన్న హిందూ ఉద్యోగులకు కుంకుమ, తిలకం దిద్దారు. నాజియా ఖాన్ అంటే చాలామందికి భయం. దానికి కారణం ఇస్లాం గురించి ఆమెకు ఉన్న అపారమైన జ్ఞానం. ఖురాన్, భగవద్గీత వంటి మత గ్రంథాలను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన ఆమె, సాక్ష్యాధారాలతో పేజీ నంబర్లతో సహా మాట్లాడితే ఎంతటి నాయకులైనా తలవంచాల్సిందే. ఇప్పటికే ఆమెకు అనేక ప్రాణ బెదిరింపులు రాగా, ఇప్పుడు లెన్స్‌కార్ట్ హిందువులకు తిలకం దిద్దడంతో పాకిస్థాన్‌లో మంట మొదలైంది.
ఓపెన్ ఛాలెంజ్: ఒక పాకిస్థానీ వ్యక్తి వీడియో ద్వారా నాజియా ఖాన్‌కు బహిరంగంగా ప్రాణ బెదిరింపులు ఇచ్చాడు. “భారత్‌ను ఇస్లామిక్ దేశంగా మార్చడాన్ని ఎవరు అడ్డుకుంటారో చూస్తాం” అని సవాలు విసిరాడు. నాజియాను కీచక పదజాలంతో దూషిస్తూ.. “నువ్వు అక్కడికి వెళ్లి తిలకం దిద్దుతావా? మేము భారత్‌ను ముస్లిం దేశంగా మార్చి తీరుతాం. షరియా చట్టాన్ని తీసుకువస్తాం. ప్రతి ఒక్కరినీ ఖాన్‌లుగా మారుస్తాం, మీరేం చేస్తారో చూస్తాం” అంటూ రెచ్చగొట్టేలా మాట్లాడాడు. నాజియా ఖాన్ ఈ వీడియోను షేర్ చేస్తూ తన గళాన్ని వినిపించారు.
