లోయలోకి దూసుకెళ్లిన వాహనం.. కారు కింద తన శరీరాన్ని అడ్డం పెట్టి నిలువరించిన తల్లి.. ముగ్గురు పిల్లల ప్రాణాలు కాపాడేందుకు ప్రాణత్యాగం.. కుటుంబ విహారయాత్రలో జరిగిన దిగ్భ్రాంతికర ప్రమాదం.!!

1999లో అమెరికాలోని కొలరాడో పర్వత ప్రాంతానికి జోయ్ వారెన్ (Joy Warren) అనే మహిళ తన భర్త, తండ్రి మరియు ముగ్గురు పిల్లలతో కలిసి ఫ్యామిలీ ట్రిప్‌కు వెళ్లారు.

ఆ సమయంలో ఆమె ముగ్గురు చిన్న పిల్లలు ఆడుకుంటూ పార్క్ చేసి ఉన్న ఎస్‌యూవీ (SUV) కారులోకి ఎక్కారు. దురదృష్టవశాత్తూ కారు గేర్ న్యూట్రల్‌లోకి జారడంతో.. వాహనం నియంత్రణ కోల్పోయి ఏటవాలుగా ఉన్న లోయ వైపు వేగంగా దొర్లుకుంటూ దూసుకెళ్లడం ప్రారంభించింది. దీన్ని చూసి తీవ్ర భయాందోళనకు గురైన తల్లి జోయ్ వారెన్, ఆలోచించడానికి కూడా సమయం లేకపోవడంతో.. దూసుకొస్తున్న కారు చక్రాల మధ్య తన శరీరాన్ని అడ్డం పెట్టి వాహనాన్ని ఆపేందుకు ప్రయత్నించారు.

ఆమె చేసిన ఈ అపూర్వ త్యాగంతో కారు వేగం కాస్త తగ్గడంతో, వెంటనే ఆమె తండ్రి కారు ఎమర్జెన్సీ హ్యాండ్‌బ్రేక్‌ను లాగి వాహనాన్ని నిలిపివేశారు. దీంతో ముగ్గురు చిన్నారులు ఎలాంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డారు. కానీ, కారు కింద నలిగిపోవడంతో జోయ్ వారెన్ తీవ్రంగా గాయపడి, నడిచే శక్తిని శాశ్వతంగా కోల్పోయారు. అయినప్పటికీ, “నా బిడ్డల ప్రాణాలను కాపాడినందుకు నేనెప్పుడూ బాధపడలేదు” అని వీల్‌చైర్‌కే పరిమితమైన ఆ తల్లి భావోద్వేగంతో చెబుతున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *