వంటగదిలో బొద్దింకలు, బల్లుల బెడదకు చెక్: ఇంట్లోని వస్తువులతోనే ఇలా మ్యాజిక్ ఉండ్రాలను తయారుచేయండి!

వంటగదిలో ఆహార పదార్థాలు ఉంచే చోట మార్కెట్లో దొరికే రసాయన స్ప్రేలను ఉపయోగించడం ఆరోగ్యానికి ఏమాత్రం సురక్షితం కాదు. అటువంటి సమయంలో మన ఇంట్లో దొరికే సాధారణ వస్తువులతో తయారుచేసే సహజసిద్ధమైన చిట్కాలు బాగా పనిచేస్తాయి.

కావలసిన పదార్థాలు:

  • టీ పొడి – 2 టీస్పూన్లు
  • టూత్ పేస్ట్ – 1 స్పూన్
  • బేకింగ్ సోడా – 1 స్పూన్
  • బేకింగ్ పౌడర్ – 1 స్పూన్

తయారీ విధానం: ఒక గిన్నెలో రెండు టీస్పూన్ల టీ పొడి తీసుకోండి. అందులో ఒక స్పూన్ టూత్ పేస్ట్, ఒక స్పూన్ బేకింగ్ సోడా మరియు ఒక స్పూన్ బేకింగ్ పౌడర్ వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండ్రాలుగా (ఉండలుగా) చేసుకోవాలి. ఈ ఉండల నుండి వచ్చే వాసన బల్లులను, బొద్దింకలను ఆకర్షిస్తుంది. కానీ, వీటిని తిన్నప్పుడు వాటి జీర్ణవ్యవస్థ దెబ్బతిని అవి చనిపోతాయి.

ఉపయోగించే విధానం: ఈ చిన్న ఉండలను వంటగదిలోని క్యాబినెట్లలో లేదా బొద్దింకలు, బల్లుల సంచారం ఎక్కువగా ఉన్న చోట ఉంచాలి. ఒకవేళ ఈ ఉండలు తయారుచేయడానికి సమయం లేకపోతే.. టీ పొడిని నీళ్లలో మరిగించి, ఆ నీటిలో బేకింగ్ సోడా, బేకింగ్ పౌడర్ కలిపి వడకట్టాలి. ఈ మిశ్రమాన్ని ఒక స్ప్రే బాటిల్‌లో పోసి, బొద్దింకలు ఉన్న చోట స్ప్రే చేయవచ్చు.


Posted

in

by

Tags: