వంట గ్యాస్ సిలిండర్ల విషయంలో ప్రజలు భయాందోళన చెందవద్దు: చమురు సంస్థల విజ్ఞప్తి

వంట గ్యాస్ సిలిండర్ల సరఫరా విషయంలో ప్రజలు ఎలాంటి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చమురు సంస్థలు స్పష్టం చేశాయి.

మధ్యప్రాచ్య దేశాలలో జరుగుతున్న యుద్ధం కారణంగా భారతదేశంలో గ్యాస్ కొరత ఏర్పడింది. ముఖ్యంగా వాణిజ్య అవసరాలకు (Commercial) వాడే గ్యాస్ సరఫరా బాగా దెబ్బతినడంతో చాలా చోట్ల హోటళ్లు మూతపడ్డాయి. కొన్ని చోట్ల ఆహార మెనూలను తగ్గించారు. వాణిజ్య సిలిండర్ల కొరత ఉన్నప్పటికీ, గృహ అవసరాలకు వాడే వంట గ్యాస్ సిలిండర్లకే మొదటి ప్రాధాన్యత ఇస్తామని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. గ్యాస్‌ను నిత్యావసర వస్తువుల జాబితాలోకి చేర్చింది.

అయినప్పటికీ ప్రజల్లో నెలకొన్న భయాన్ని పోగొట్టేందుకు చమురు సంస్థలు ముందుకు వచ్చాయి.

భారత్ పెట్రోలియం (BPCL) ప్రకటన: “ప్రజలు భయపడాల్సిన పనిలేదు. ఎల్పీజీ సరఫరా మరియు సేవలు ఎప్పటిలాగే కొనసాగుతున్నాయి. వినియోగదారులకు మెరుగైన సేవలు అందించడానికి మా సంస్థ ఇప్పటికే సిబ్బందిని 16.67 శాతం పెంచింది. మరో 28.5 శాతం సిబ్బందిని పెంచే ప్రక్రియ కొనసాగుతోంది. బుకింగ్‌లు మరియు ఫిర్యాదుల పరిష్కారం కోసం కస్టమర్ కేర్ సెంటర్లను మరింత బలోపేతం చేశాం.”

హిందుస్థాన్ పెట్రోలియం (HPCL) ప్రకటన: “ప్రజలు ఆత్రుత పడకూడదు. అక్రమ నిల్వలు మరియు బ్లాక్ మార్కెటింగ్‌ను అరికట్టడానికి, వినియోగదారులందరికీ సరైన సమయంలో గ్యాస్ అందేలా చూడటానికి రెండు బుకింగ్‌ల మధ్య 25 రోజుల గ్యాప్ (విరామం) ఉండాలనే నిబంధనను అమలు చేస్తున్నాం.”


Posted

in

by

Tags: