‘వందే భారత్‌ను ఆపి తీరుతాం’: రీల్స్ కోసం పట్టాలపై దుంగలు వేసి రైలును ఆపిన యువకులు.. వీడియో వైరల్!

సోషల్ మీడియాలో పాపులారిటీ కోసం కొందరు యువకులు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఆపి, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడారు. రైల్వే పట్టాలపై పెద్ద పెద్ద చెక్క దుంగలను ఉంచి, హై-స్పీడ్ రైలు ఆగిపోయేలా చేశారు.

ఏం జరిగింది?

వైరల్ అవుతున్న వీడియోలో, ఆ యువకులు పట్టాలపై దుంగలు వేసి.. రైలు ఆగిపోగానే “వందే భారత్ రుక్వా దియే” (వందే భారత్‌ను ఆపేశాం) అని నవ్వుతూ కేకలు వేయడం వినిపిస్తోంది. రైలులోని ఒక పోలీస్ కానిస్టేబుల్ వారి వద్దకు రాగా.. తాము రైలు ఎక్కడానికి ప్రయత్నించడం లేదని, కేవలం వీడియో షూట్ చేస్తున్నామని ఆ యువకులు నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు.

ఈ వీడియో ఎక్స్ (X) వేదికగా వేగంగా వ్యాపించడంతో, నెటిజన్లు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ను ట్యాగ్ చేస్తూ నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. “ఇది ఉగ్రవాద చర్యతో సమానం, వీరిపై ఎన్ఎస్ఏ (NSA) కింద కేసు నమోదు చేయాలి” అని పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.


Posted

in

by

Tags: