కర్ణాటక రాష్ట్రం బెంగళూరులోని పీణ్యా పరిధిలో ఉన్న తొడ్డబిడరకల్లు ప్రాంతంలో, జయమ్మ అనే మహిళ బుధవారం తెల్లవారుజామున అలవాటు ప్రకారం వాకింగ్ చేస్తోంది.
ఆ సమయంలో ద్విచక్రవాహనంపై వచ్చిన ఇద్దరు అపరిచిత వ్యక్తులు, జయమ్మను అడ్డుకుని ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కోవడానికి ప్రయత్నించారు.
ఆ సమయంలో జయమ్మ వారిని ఎదుర్చి పోరాడటంతో, ఆగ్రహానికి గురైన దొంగలు ఆమెపై విచక్షణారహితంగా దాడి చేశారు. ఈ ఘటనలో జయమ్మ ముఖం, మెడ భాగాల్లో తీవ్ర గాయాలయ్యాయి. దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమెను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన బెంగళూరు నగర పోలీసులు, ఆ ప్రాంతంలోని సీసీటీవీ దృశ్యాలను పరిశీలిస్తూ దొంగల కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Leave a Reply