వాషింగ్ మెషీన్ ఉంది కదా అని అన్నింటినీ అందులో వేయకండి; జాగ్రత్త వహించకపోతే భారీ మూల్యం తప్పదు!

బట్టలు చేత్తో ఉతకడం కష్టమని చాలామంది చేతికి దొరికినవన్నీ వాషింగ్ మెషీన్‌లో వేస్తుంటారు. కానీ ఈ అలవాటు వల్ల బట్టలు పాడవ్వడమే కాకుండా మెషీన్ ఆయుష్షు కూడా తగ్గుతుంది.

మెషీన్‌లో వేయకూడని వస్తువులు:
  • అలంకరణలున్న దుస్తులు: పూసలు, అద్దాలు లేదా ఎంబ్రాయిడరీ వర్క్ ఉన్న బట్టలను మెషీన్‌లో వేయకూడదు. మెషీన్ తిరిగేటప్పుడు ఆ పూసలు ఊడిపోయి మెషీన్ లోపలి భాగాలకు గీతలు పడేలా చేస్తాయి.
  • సూట్లు మరియు టైలు: కాటన్ సూట్లు, టైలను మెషీన్‌లో వేస్తే అవి ముడతలు పడి వాటి ఆకృతి దెబ్బతింటుంది. వీటికి డ్రై క్లీనింగ్ మాత్రమే శ్రేయస్కరం.
  • మెత్తని బొమ్మలు (Soft Toys): పత్తి లేదా స్పాంజ్ ఉన్న బొమ్మలను మెషీన్‌లో వేస్తే అవి చిరిగిపోయే ప్రమాదం ఉంది. బ్రాండెడ్ బొమ్మలను చేత్తో ఉతకడమే సురక్షితం.
  • తలగడలు (Pillows): దిండ్లను మెషీన్‌లో వేయడం వల్ల అవి లోపల చిరిగిపోయి, పత్తి బయటకు వచ్చి మెషీన్ డ్రైనేజీ వ్యవస్థను పాడుచేస్తాయి.
  • ప్రత్యేక రకపు బట్టలు: లెదర్ (Leather), వెల్వెట్, రేయాన్ వంటి బట్టలను మెషీన్‌లో వేయకుండా డ్రై క్లీనింగ్‌కు ఇవ్వాలి. అలాగే నిప్పు అంటుకోకుండా కెమికల్ కోటింగ్ ఉన్న యూనిఫాంలను మెషీన్‌లో ఉతికితే ఆ రక్షణ కవచం పోతుంది.
ముఖ్యమైన తనిఖీ – జేబులు:

బట్టలు మెషీన్‌లో వేసే ముందు జేబులను తప్పనిసరిగా తనిఖీ చేయాలి. అందులో నాణేలు, తాళాలు, పిన్నులు లేదా ఆభరణాలు లేకుండా చూసుకోవాలి. ఇవి మెషీన్ డ్రమ్ గ్లాస్‌ను పగులగొట్టడమే కాకుండా నీరు బయటకు వెళ్లే పైపులను బ్లాక్ చేస్తాయి.

నిరభ్యంతరంగా మెషీన్‌లో ఉతకగలిగేవి:

మనం మెషీన్‌లో వేయకూడదు అనుకునే కొన్ని వస్తువులను వాస్తవానికి సురక్షితంగా ఉతకవచ్చు:

  • షవర్ కర్టెన్లు: వీటిని ‘డెలికేట్ మోడ్’లో ఉతకవచ్చు. మెషీన్ బ్యాలెన్స్ కోసం వీటితో పాటు ఒకటి రెండు టవల్స్ కూడా వేయండి.
  • యోగా మ్యాట్లు మరియు బ్యాగులు: వీటిపై ఉన్న లేబుల్స్ తనిఖీ చేసి మెషీన్‌లో వేయవచ్చు.
  • క్లీనింగ్ క్లాత్స్: మాప్ హెడ్స్, మైక్రో ఫైబర్ క్లాత్‌లను మెషీన్‌లో సులభంగా ఉతకవచ్చు.

Posted

in

by

Tags: