వింత ఘటన: 14 ఏళ్ల కొడుకును వదిలి ప్రియుడితో పారిపోయిన మహిళ.. ప్రాణభయంతో ఎస్పీ కార్యాలయానికి!

ప్రేమకు కళ్లు లేవు, వయసుతో సంబంధం లేదనే మాట కొన్ని జంటల విషయంలో నిజమవుతోంది. 55 ఏళ్ల వృద్ధుడు 20 ఏళ్ల యువతిని పెళ్లి చేసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి. అచ్చం అలాంటిదే మరో ఘటన మైసూరులో వెలుగులోకి వచ్చింది. 37 ఏళ్ల మహిళ, 22 ఏళ్ల యువకుడితో ప్రేమలో పడి ఇల్లు వదిలి వచ్చేసింది.

రహస్యంగా వివాహం చేసుకున్న ఈ జంట ఇప్పుడు ఎస్పీ కార్యాలయం మెట్లు ఎందుకు ఎక్కాల్సి వచ్చింది? ఈ జంటను వేధిస్తున్న ఆ భయం ఏంటి?

పరిచయం ప్రేమగా మారిందిలా.. బెంగళూరులోని చల్లఘట్ట నివాసి అయిన 37 ఏళ్ల కవితకు, మైసూరు రమ్మనహళ్లి నివాసి భాస్కర్ (22)తో పరిచయం ఏర్పడింది. భాస్కర్ బెంగళూరులో తన పెద్దమ్మ ఇంట్లో ఉంటూ ఆటో, టీటీ (TT) నడుపుతుండేవాడు. కవితను, ఆమె తల్లి భాగ్యమ్మను తరచుగా బండే మాకాళమ్మ ఆలయానికి తన వాహనంలో తీసుకువెళ్లేవాడు. ఈ క్రమంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది.

కొడుకును వదిలి ప్రియుడితో పరారీ కవితకు ఇదివరకే వివాహం కాగా, ఎనిమిదేళ్ల క్రితం ఆమె భర్త అనారోగ్యంతో (లో బీపీ) మరణించాడు. వీరికి 14 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. భర్త చనిపోయిన తర్వాత కవిత హౌస్ కీపింగ్ పని చేసుకుంటూ పుట్టింట్లోనే ఉండేది. అయితే, తన కంటే 15 ఏళ్లు చిన్నవాడైన భాస్కర్ కోసం ఆమె తన 14 ఏళ్ల కొడుకును కూడా వదిలేసి ప్రియుడితో పారిపోయింది.

రహస్య వివాహం – కిడ్నాప్ కేసు భాస్కర్, కవితలు మైసూరులోని ఒంటికొప్పలు వెంకటేశ్వర స్వామి ఆలయంలో రహస్యంగా పెళ్లి చేసుకున్నారు. మరోవైపు, బెంగళూరులోని కుంబళగోడు పోలీస్ స్టేషన్‌లో కవిత తండ్రి మల్లికార్జున్.. తన కూతురిని ఎవరో కిడ్నాప్ చేశారంటూ ఫిర్యాదు చేశారు.

దంపతులను వేధిస్తున్న ప్రాణభయం ఇంట్లో తమ పెళ్లిని అంగీకరించకపోవడమే కాకుండా, కవిత బావ కుమారుడు తమను చంపేస్తానని బెదిరిస్తున్నాడని ఈ జంట ఆరోపిస్తోంది. ప్రాణభయంతో బెంగళూరు వదిలి మైసూరు చేరుకున్న ఈ దంపతులు ఇప్పుడు రక్షణ కల్పించాలంటూ మైసూరు ఎస్పీ కార్యాలయాన్ని ఆశ్రయించారు. తమకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని పోలీసులను వేడుకుంటున్నారు.


Posted

in

by

Tags: