వికృత చేష్ట! పందెం కోసం కన్నతండ్రినే పెళ్లాడిన కూతురు; తండ్రి-కూతుళ్ల బంధాన్ని మంటగలిపిన ఘటనపై కోర్టు సీరియస్.. ఇద్దరికీ జైలు శిక్ష!

రక్త సంబంధాల పవిత్రతను కాలరాస్తూ, తన సొంత కుమార్తెనే వివాహం చేసుకున్న తండ్రికి, అందుకు సహకరించిన కుమార్తెకు అమెరికా కోర్టు జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది. ఒక వింతైన పందెం కోసం జరిగిన ఈ ఘటన ప్రపంచాన్నే దిగ్భ్రాంతికి గురిచేసింది.

అసలేం జరిగిందంటే? అమెరికాలోని నెబ్రాస్కా రాష్ట్రానికి చెందిన ట్రావిస్ ఫీల్డ్‌గ్రోవ్‌కు 2000వ సంవత్సరంలో సమంత అనే కుమార్తె జన్మించింది. కుమార్తె పుట్టిన కొద్ది కాలానికే భార్యతో విడిపోయిన ట్రావిస్, తన కూతురిని ఎప్పుడూ చూడలేదు. సుమారు 20 ఏళ్ల తర్వాత, సమంత తన 20వ ఏట మొదటిసారి తన తండ్రిని కలిసింది.

అయితే ఈ కలయిక తర్వాత తండ్రి-కూతుళ్ల బంధం తప్పుడు దారి పట్టింది. సమంతకు తన సవతి సోదరితో తీవ్రమైన శత్రుత్వం ఉండేది. ఆ సోదరిని కించపరచడానికి, ఆవేశానికి గురిచేయడానికి సమంత ఒక విపరీతమైన పందెం కట్టింది. దాని ప్రకారం, తన సొంత తండ్రితోనే శారీరక సంబంధం పెట్టుకుని, అతడిని వివాహం చేసుకుంటానని సవాలు విసిరింది. ఆ వికృత సవాలును నెరవేర్చడానికి తండ్రి కూడా సిద్ధపడ్డాడు.

DNA పరీక్షతో బయటపడ్డ నిజం: వీరిద్దరూ వివాహం చేసుకున్నట్లు సోషల్ మీడియాలో సమాచారం వ్యాపించడంతో పోలీసులు రంగంలోకి దిగారు. ప్రారంభంలో వీరిద్దరికీ వేర్వేరు పేర్లు ఉండటంతో, తాము తండ్రి-కూతుళ్లం కాదని బుకాయించారు. కానీ పోలీసులు అనుమానంతో నిర్వహించిన ‘DNA’ పరీక్షలో ట్రావిస్, సమంతకు కన్నతండ్రి అని నూటికి నూరు శాతం నిర్ధారణ అయ్యింది.

చట్ట ప్రకారం తండ్రి-కూతుళ్లు వివాహం చేసుకోవడం క్రిమినల్ నేరం. ఈ కేసు కోర్టుకు వచ్చినప్పుడు న్యాయమూర్తి వీరిద్దరినీ తీవ్రంగా మందలించారు. నేరం రుజువు కావడంతో తండ్రి ట్రావిస్‌కు 2 ఏళ్ల జైలు శిక్ష, కుమార్తె సమంతకు 9 నెలల జైలు శిక్ష విధించారు. అంతేకాకుండా, జైలు నుండి విడుదలైన తర్వాత కూడా వీరిద్దరూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఒకరినొకరు సంప్రదించకూడదని కోర్టు కఠిన ఉత్తర్వులు జారీ చేసింది.


Posted

in

by

Tags: