ఆస్ట్రియాలోని మార్చ్ట్రెంక్ నగరానికి చెందిన 51 ఏళ్ల రాబర్ట్ ఐచింగర్ అనే వ్యక్తి, డబ్బు కోసం తన 39 ఏళ్ల భార్య డేనియెలా ఐచింగర్కు తెలియకుండా ఆమెకు మత్తు, నిద్ర మాత్రలు ఇస్తూ వచ్చాడు.
భార్య స్పృహ కోల్పోయిన సమయంలో, ఇతర వ్యక్తులను ఇంటికి రప్పించి ఆమెపై లైంగిక దాడికి పాల్పడేందుకు అనుమతించేవాడు.
ఈ క్రమంలో గత జూన్ 25న జరిగిన తీవ్ర లైంగిక దాడి కారణంగా డేనియెలా శరీరంలో ప్రధాన రక్తనాళం చిట్లిపోయి, తీవ్ర రక్తస్రావమై ఆమె ప్రాణాలు కోల్పోయింది. కూతురు ఇంటికి వచ్చి చూసేసరికి, తల్లి వాటర్బెడ్పై రక్తపు మడుగులో విగతజీవిగా పడి ఉండటం చూసి గుండెలవిసేలా రోదించింది. పోలీసుల విచారణలో.. భార్య మరణించిన ఆ రాత్రి కూడా, “ఆమె శవంలా పడి ఉంది, మద్యం తాగించాను.. వచ్చి కలువు” అంటూ పక్కింటి వ్యక్తికి రాబర్ట్ పంపిన షాకింగ్ మెసేజ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
దీంతో పోలీసులు రాబర్ట్ను అరెస్ట్ చేసి దర్యాప్తు ముమ్మరం చేశారు. గతంలో అతడి మాజీ భార్య కూడా స్పందిస్తూ.. రాబర్ట్ తనను వైఫ్ స్వాపింగ్ (భార్యల మార్పిడి)కి బలవంతం చేశాడని, అందుకు నిరాకరించినందుకు తన దవడ ఎముక విరిగేలా దాడి చేశాడని వాంగ్మూలం ఇచ్చింది. కట్టుకున్న భార్యపైనే అత్యంత పైశాచికంగా వ్యవహరించి ప్రాణాలు తీసిన రాబర్ట్ రాక్షసత్వం ప్రపంచవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించింది.
