విజయం కావాలా? అయితే నోరు మూసుకోండి! – జీవితాన్ని మార్చే 5 రహస్యాలు!

మనం జీవితంలో గెలవాలని, బాగా సంపాదించాలని, నలుగురిలో గౌరవంగా బతకాలని రాత్రింబవళ్లు కష్టపడుతుంటాం. కానీ కొన్నిసార్లు మనం చేసే ఒక చిన్న తప్పు మన కష్టాన్ని వృధా చేస్తుంది. ఆ తప్పు మరేదో కాదు.. మన నోరే! “నోరు తెరిచిన చేపే గాలానికి చిక్కుతుంది” అంటారు. మనుషుల పరిస్థితి కూడా అంతే. మనకు తెలియకుండా మనం బయటపెట్టే కొన్ని విషయాలే మనకు వినాయక చవితి శాపాల్లా మారుతాయి. అందుకే ఎవరికీ చెప్పకూడని ఆ 5 రహస్యాలు ఇవే:

1. మీ ఆదాయం ఒక మిస్టరీగా ఉండనివ్వండి! మీరు ఎంత సంపాదిస్తున్నారో ఎవరికీ చెప్పకండి. తక్కువ సంపాదిస్తున్నానని చెబితే ఈ లోకం మిమ్మల్ని తక్కువ చేసి చూస్తుంది, సరైన గౌరవం ఇవ్వదు. ఒకవేళ ఎక్కువ సంపాదిస్తున్నానని చెబితే.. అప్పు అడగడానికి ఒక గుంపు వస్తుంది, లేదంటే మీపై అసూయ పడతారు. అందుకే మీ జేబులో ఎంత ఉందనేది ఎదుటివారికి ఒక చిక్కుముడిలాగే ఉండాలి.

2. మీ భవిష్యత్తు ప్రణాళికలు (Future Plans): మనం ఏదైనా కారు కొనాలన్నా లేదా ఇల్లు కట్టాలన్నా.. అది జరగడానికి ఆరు నెలల ముందే ఊరంతా చెబుతుంటాం. కానీ సైకాలజీ ప్రకారం, మన లక్ష్యాన్ని ముందే బయటపెడితే, దానిని సాధించాలనే కసి మనలో తగ్గిపోతుందట. అంతేకాకుండా ఎదుటివారి కళ్లు (దృష్టి), అసూయ మీ ఎదుగుదలను అడ్డుకోవచ్చు. అందుకే పని పూర్తయ్యాక శబ్దం చేయండి, అప్పటివరకు నిశ్శబ్దంగా పావులు కదపండి. మీ పనిలో వేగం ఉండాలి కానీ మాటల్లో కాదు.

3. కుటుంబ సమస్యలు: ప్రతి ఇంట్లోనూ గొడవలు, సమస్యలు ఉండటం సహజం. కానీ భార్యాభర్తల గొడవలు లేదా ఇంటి సమస్యలను మూడో వ్యక్తికి చెప్పకండి. మీరు ఊరట కోసం చెబుతారు, కానీ వారు దానిని ఒక గాసిప్‌లా మార్చి ఊరంతా ప్రచారం చేస్తారు. మీ బలహీనత తెలిస్తే దానితోనే మిమ్మల్ని దెబ్బతీయాలని చూసేవారు ఈ లోకంలో చాలా మంది ఉంటారు.

4. మీరు చేసే దానధర్మాలు: “కుడి చేయి చేసే సాయం ఎడమ చేతికి తెలియకూడదు” అంటారు. మీరు ఇతరులకు చేసే సాయాన్ని ప్రచారం చేసుకోకండి. అలా చెప్పుకుంటే ఆ సాయం వల్ల వచ్చే పుణ్యం పోయి, అహంకారం పెరుగుతుంది. నిశ్శబ్దంగా సాయం చేయండి, ప్రకృతి మీకు తిరిగి ఇచ్చేస్తుంది.

5. మీ బలహీనతలు (Weaknesses): చివరగా.. మీ బలహీనత ఏంటో మీ శత్రువుకు కూడా తెలియకూడదు. “నాకు ఇది రాదు, నాకు ఇదంటే భయం” అని మీరే చెబితే, మిమ్మల్ని ఓడించడం వారికి చాలా సులభం అవుతుంది. లోకానికి మిమ్మల్ని ఒక ఇనుప మనిషిలా (Strong Person) చూపించుకోండి.

గుర్తుంచుకోండి.. మాట అనేది బాణం లాంటిది, వదిలితే తిరిగి పట్టుకోలేము. పైన చెప్పిన 5 విషయాలను మీ మనసులోనే భద్రంగా దాచుకోండి. మీ విజయం శబ్దం చేయాలి కానీ మీ ప్రయత్నం నిశ్శబ్దంగా ఉండాలి.


Posted

in

by

Tags: