దుబాయ్ ఎయిర్‌లైన్స్ ‘ఫ్లైదుబాయ్’ (flydubai) విమానానికి కో-పైలట్‌గా పనిచేసిన 29 ఏళ్ల ఒమన్ దేశస్థుడు హమామ్ అల్-హమామి.. విమానాన్ని హైజాక్ చేసి ఇజ్రాయెల్‌లో కుప్పకూల్చేందుకు ప్రయత్నించాడన్న వార్త తీవ్ర కలకలం రేపుతోంది.
గతంలో ఉగ్రవాద భావజాలానికి ఆకర్షితుడైన ఇతడిని ‘ఓమన్ ఎయిర్’ విధుల నుంచి తొలగించింది. ఆ తర్వాత పలు విమానయాన సంస్థలు మారిన ఇతను, చివరగా గత ఫిబ్రవరిలో ఈ ‘ఫ్లైదుబాయ్’లో చేరాడు.
ఇజ్రాయెల్, ఒమన్ దేశాల మధ్య దౌత్య సంబంధాలు లేకపోవడంతో, ఒమన్ పైలట్లకు ఇజ్రాయెల్‌లోకి ప్రవేశించేందుకు అనుమతి లేదు. అయితే, యూఏఈ, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన ‘అబ్రహం అకార్డ్స్’ ఒప్పందంలోని కొన్ని లొసుగులను ఉపయోగించుకుని, హమామి ఆ నిబంధనలను ఉల్లంఘించి ఇజ్రాయెల్‌కు విమాన ప్రయాణాలు చేశాడు.
పైగా, ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ ‘షిన్ బెట్’ (Shin Bet) ఇతని నేపథ్యం గురించి సరైన విచారణ చేపట్టకపోవడం కూడా దీనికి ఒక ప్రధాన కారణమని చెబుతున్నారు.
ఈ ఘటన తర్వాత హమామి సోషల్ మీడియా ఖాతాలను పరిశీలించగా, అతనికి తీవ్రమైన మత ఛాందసవాద భావాలు ఉన్నాయని, ఇజ్రాయెల్‌కు వ్యతిరేకంగా తీవ్రంగా వ్యవహరించేవాడని తేలింది.
విచారణ అనంతరం అతను ఇచ్చిన సమాచారం ప్రకారం.. ఆ విమానాన్ని ఇజ్రాయెల్‌లో క్రాష్ (కుప్పకూల్చాలని) చేయాలని ప్లాన్ చేసినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అంతేకాకుండా ఈ కుట్రలో ఇంకా ఎవరికైనా ప్రమేయం ఉందా అనే కోణంలో కూడా తీవ్ర విచారణ జరుగుతోంది.
ఇదే తరహాలో పాకిస్తాన్ పైలట్ ఎవరైనా భారతదేశంలోకి ప్రవేశించగలరా అనే ప్రశ్న తలెత్తినప్పుడు.. భారత్, పాకిస్తాన్ మధ్య నేరుగా వాయుమార్గ ప్రయాణాలు (విమాన సర్వీసులు) పూర్తిగా నిషేధించబడ్డాయి. అయితే, కఠినమైన భద్రతా నిబంధనలు మరియు బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ (BCAS) చేపట్టే అత్యంత కఠినమైన బ్యాక్‌గ్రౌండ్ చెక్‌ల కారణంగా.. విదేశీ పౌరసత్వం ఉన్నప్పటికీ పాకిస్తాన్‌కు చెందిన పైలట్ సులభంగా భారతదేశంలోకి ప్రవేశించడం ఆచరణాత్మకంగా అసాధ్యమని విమానయాన నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Leave a Reply