అక్రమ సంబంధాలు, వివాహేతర సంబంధాలు (Extra Marital Affairs) అనే పదాలు ఈ రోజుల్లో తరచుగా వింటున్నాము. ఇది కొత్త సమస్యేమీ కాదు, కానీ సోషల్ మీడియా మరియు మీడియా ప్రభావం వల్ల ఇవి ఎక్కువగా వెలుగులోకి వస్తున్నాయి.
సాధారణంగా వివాహేతర సంబంధం అనగానే భార్య ఉండగానే మరో స్త్రీతో సంబంధం పెట్టుకునే పురుషుడు గుర్తొస్తాడు. కానీ, భర్త మంచివాడైనా, అందగాడైనా సరే మహిళలు ఇతర పురుషుల పట్ల ఆకర్షితులవుతున్న ఘటనలు పెరుగుతున్నాయి. విచిత్రమేమిటంటే, ఆ పరాయి వ్యక్తికి తన భర్తతో ఏ విషయంలోనూ (రూపం, డబ్బు, గుణం) పోలిక లేకపోయినా మహిళలు వారి వెనుక వెళ్తుంటారు. అసలు దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాలేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
ఎందుకు ఇలా జరుగుతుంది?
ఇలాంటి వార్తలు రాగానే ‘డబ్బు కోసమే’, ‘భర్త కంటే అందగాడు కాబట్టే’ అని అసభ్యకరమైన కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ, అసలు కారణం వేరే ఉందని ప్రముఖ మానసిక నిపుణులు డాక్టర్ సౌజన్య వశిష్ట్ వివరించారు. ఆమె విశ్లేషణ ప్రకారం ప్రధాన కారణాలు ఇవే:
1. భర్త నుండి దక్కని ప్రశంసలు మరియు గుర్తింపు
మహిళలు ఇతర పురుషుల వైపు ఆకర్షితులు కావడానికి మొదటి మరియు ప్రధాన కారణం భర్త నుండి తగినంత ప్రశంసలు దక్కకపోవడం.
- అపేక్ష: ప్రతి మహిళ తన అందం గురించి, తాను పడే కష్టం గురించి లేదా కనీసం తాను వండిన వంట గురించి భర్త మెచ్చుకోవాలని కోరుకుంటుంది.
- మౌనం: ‘నువ్వు నా కోసం ఎంత కష్టపడుతున్నావు’, ‘ఈ రోజు వంట చాలా బాగుంది’, ‘ఈ చీరలో నువ్వు చాలా అందంగా ఉన్నావు’ అని భర్త అనాలని ఆమె మనసులో ఆశ ఉంటుంది.
- అశ్రద్ధ: చాలా మంది భర్తలు “నా భార్య అందంగానే ఉంటుంది, వంట బాగానే చేస్తుంది.. అందులో కొత్తగా చెప్పేదేముంది?” అనే ధోరణితో ప్రశంసించరు. ఈ చిన్న అశ్రద్ధే మహిళల్లో అసంతృప్తికి బీజం వేస్తుంది.
2. పరాయి వ్యక్తి ఇచ్చే ప్రాధాన్యత
ఇంట్లో గుర్తింపు దక్కని సమయంలో, బయటి వ్యక్తి ఎవరైనా ఆమెను ప్రశంసించినప్పుడు ఆమె మనసు చలిస్తుంది.
- సోషల్ మీడియా: ఉదాహరణకు, సోషల్ మీడియాలో పెట్టిన ఫోటోపై ఎవరైనా గొప్పగా కామెంట్ చేస్తే ఆమె ఎంతో సంతోషిస్తుంది.
- మానసిక మార్పు: ఇంటికి వచ్చిన అతిథి ఆమె వంటను మెచ్చుకున్నా, లేదా ఆఫీసులో ఎవరైనా ఆమె పనిని అభినందించినా.. భర్త నుండి పొందని ఆ ‘గుర్తింపు’ ఆ వ్యక్తి నుండి లభించగానే ఆమెకు అతనిపై సానుకూల అభిప్రాయం ఏర్పడుతుంది. ఆ వ్యక్తి దీన్ని అదనుగా తీసుకుని మెచ్చుకుంటూ ఉంటే, భర్తలో లేని గుణాలన్నీ ఆ పరాయి వ్యక్తిలో ఉన్నాయని ఆమె భ్రమపడే అవకాశం ఉందని డాక్టర్ సౌజన్య తెలిపారు.
3. ఇది కేవలం శారీరక సంబంధం మాత్రమే కాదు
చాలా సందర్భాల్లో మహిళలకు శారీరక సంబంధంపై ఆసక్తి ఉండదు. ఇది ఒక రకమైన మానసిక ఆకర్షణ (Emotional Attraction).
- భర్త నుండి పొందని గౌరవం, ప్రేమ, మాటల రూపంలో అందే ప్రశంసలు బయటి వ్యక్తి నుండి దొరికినప్పుడు ఆమె తెలియకుండానే ఆ వ్యక్తికి దగ్గరవుతుంది.
- అయితే, అతిగా పొగిడే పురుషుల విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. అది అబద్ధపు ప్రశంస అని తెలిసినప్పుడు కూడా మహిళల మనసు వికలమవుతుంది. అందుకే ప్రశంస అనేది నిజాయితీగా, పరిమితిలో ఉంటేనే బంధం గట్టిగా ఉంటుంది.
