విహారయాత్రకు వచ్చిన చోట ఇంతటి ఆగడమా..? హోటల్‌లోకి చొరబడి యజమాని, సిబ్బందిపై దాడి చేసిన పర్యాటకులు..! గుంపుగా చేరి దాడి చేయడంతో హోటల్ సిబ్బంది హాహాకారాలు..!!!

ఉత్తరాఖండ్ రాష్ట్రం ముస్సోరీలోని ఒక కేఫ్-రెస్టారెంట్‌లోకి చొరబడి దాని యజమాని మరియు సిబ్బందిపై కొందరు దాడి చేసిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

సెప్టెంబర్ 15వ తేదీ మధ్యాహ్నం సుమారు 3.51 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. వాహనంలో వచ్చిన కొందరు చేతుల్లో కర్రలతో రెస్టారెంట్‌లోకి ప్రవేశించి అక్కడున్న వారితో వాగ్వాదానికి దిగిన దృశ్యాలు సీసీటీవీలో రికార్డయ్యాయి.

అకస్మాత్తుగా జరిగిన ఈ దాడితో రెస్టారెంట్‌లో భయాందోళనలు నెలకొన్నాయి. కొందరు కర్రలతో లోపలికి వెళ్లి అక్కడున్న వారిపై దాడి చేసినట్లు సీసీటీవీ దృశ్యాల ద్వారా వెల్లడైంది. రెస్టారెంట్ వెలుపల అమర్చిన మరో కెమెరాలో కూడా కొందరు ఒకరిపై ఒకరు దాడి చేసుకుంటున్న దృశ్యాలు నమోదయ్యాయి.

ఈ ఘటన పట్ల స్థానిక వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేశారు. పర్యాటక కేంద్రమైన ముస్సోరీకి దేశం నలుమూలల నుండి పర్యాటకులు వస్తుంటారని, ఏదైనా సమస్య తలెత్తితే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకోకుండా పోలీసులకు ఫిర్యాదు చేయాలని వారు సూచించారు.

ఈ ఘటనపై రెస్టారెంట్ యజమాని ఇచ్చిన ఫిర్యాదు మేరకు ముస్సోరీ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీటీవీ దృశ్యాలను పరిశీలించి దాడికి పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వేగంగా వైరల్ అవుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *