వీడియో: ఎండకు స్పృహ తప్పిన తల్లి కోసం ఆ బాలుడు చేసిన పని.. మనందరికీ ఒక పాఠం!

ఎండ తీవ్రతకు స్పృహ తప్పి పడిపోయిన తన తల్లిని చూసి ఆ చిన్న బాలుడు చేసిన పని చూస్తే నిజంగా మనందరికీ ఒక పాఠంలా అనిపిస్తుంది. అంత చిన్న వయసులోనూ ఆ పిల్లాడికి తన అమ్మపై ఉన్న ప్రేమ, ఆవేదన వర్ణనాతీతం.

అమ్మే మన సర్వస్వం. పిల్లల కోసం తల్లి మనసు ఎంతలా తపిస్తుందో, బహుశా పిల్లలకు కూడా అమ్మ పట్ల అదే స్థాయి ప్రత్యేక శ్రద్ధ ఉంటుంది. దీనికి పేదరికం, సిరిసంపదలు ఏవీ అడ్డురావు.

ఈ చిన్న బాలుడు తన తల్లిని కాపాడుకున్న తీరు చూస్తే మన హృదయం ద్రవిస్తుంది. సుమారు 9-10 ఏళ్ల వయసున్న ఆ అబ్బాయి, మండుతున్న ఎండలో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చేతిలో నీళ్ల బాటిల్ పట్టుకుని పరుగెత్తుకుంటూ వస్తాడు.

రోడ్డు పక్కన ఎండ వేడికి తట్టుకోలేక అతని తల్లి స్పృహ తప్పి పడిపోయి ఉంటుంది. తన తల్లి కోసం ఎక్కడి నుంచో నీళ్లు తెచ్చి, ఆమెకు తాగించి, ముఖంపై నీళ్లు చల్లి ఎలాగోలా ఆమెను స్పృహలోకి తెచ్చి కూర్చోబెడతాడు. అమ్మపై ఆ బాలుడికి ఉన్న నిష్కల్మషమైన ప్రేమకు, బాధ్యతకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు.


Posted

in

by

Tags: