సోషల్ మీడియాలో ప్రస్తుతం ఒక వీడియో తెగ వైరల్ అవుతోంది. జనవరి 2026లో వెలుగులోకి వచ్చిన ఈ క్లిప్‌లో ఒక కోచింగ్ క్లాస్ సీన్ కనిపిస్తుంది. అక్కడ టీచర్ ఒక విద్యార్థిని చాలా సులువైన ప్రశ్న అడిగారు, కానీ ఆ అబ్బాయి ఇచ్చిన సమాధానం అందరినీ ఆశ్చర్యానికి, నవ్వుకు గురిచేసింది.
త్వరలో దేశవ్యాప్తంగా జనవరి 26 (గణతంత్ర దినోత్సవం) వేడుకలు జరగనున్నాయి. ఈ సందర్భంగా మహాత్మా గాంధీకి సంబంధించిన ఒక వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
ఎప్పుడు జన్మించారు? క్లాసులో టీచర్ రోషన్ కుమార్ అనే విద్యార్థిని అడిగిన ప్రశ్న: “మహాత్మా గాంధీ ఎప్పుడు జన్మించారు?”. దానికి ఆ విద్యార్థి చాలా సీరియస్‌గా లేచి ఇలా సమాధానం ఇచ్చాడు- “సార్, మహాత్మా గాంధీ జన్మించలేదు, ఆయన అవతరించారు! రావణుడిని సంహరించడానికి శ్రీరాముడు ఎలాగైతే అవతారం ఎత్తారో, అలాగే బ్రిటీష్ వారిని అంతం చేయడానికి గాంధీజీ అవతరించారు!” అని చెప్పాడు.
ఇది విన్న టీచర్ ఒక్కసారిగా షాక్ అయ్యి.. “అబ్బో! నువ్వు చాలా పైకి వస్తావురా!” అని అనగానే, ఆ పిల్లాడు తడుముకోకుండా “అవును సార్, ఎలాగోలా జడ్జి లేదా కలెక్టర్ అయిపోతానుగా!” అని బదులిచ్చాడు. దీనితో క్లాస్ మొత్తం నవ్వులతో నిండిపోయింది.
వైరల్ అవుతున్న వీడియో: ఇన్స్టాగ్రామ్, ఎక్స్ (ట్విట్టర్)లో వైరల్ అవుతున్న ఈ 28 సెకన్ల వీడియోపై నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. “ఈ పిల్లాడు ఫ్యూచర్ ఐఏఎస్ కావడం ఖాయం”, “నవ్వు ఆపుకోలేకపోతున్నాం”, “ఇకపై గాంధీ జయంతిని అవతార దినోత్సవం అనాలేమో!” అంటూ ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు.
