వేగంగా ఢీకొన్న బైక్.! గాల్లోకి ఎగిరి వ్యాన్‌లో పడ్డ వ్యక్తి.. ఒళ్లు గగుర్పొడిచే భయానక ప్రమాదానికి సంబంధించిన వీడియో.!!

రోడ్లపై మితిమీరిన వేగంతో వాహనాలు నడిపినప్పుడు జరిగే ప్రమాదాలు చాలా సందర్భాలలో ప్రాణాలు తీసే విషాదాలుగా ముగుస్తాయి.

అయితే, హాలీవుడ్ సినిమా స్టంట్ దృశ్యాలను తలపించేలా, ఓ భయానక ప్రమాదంలో చిక్కుకున్న వ్యక్తి అత్యంత విచిత్రమైన రీతిలో ప్రాణాలతో బయటపడిన వీడియో ఒకటి ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది.

ఒక వ్యక్తి నడుపుతున్న బైక్ వేగంగా వచ్చి ఎదురుగా వెళ్తున్న వ్యాన్‌ను బలంగా ఢీకొట్టింది. అయితే అదృష్టవశాత్తూ ఆ వ్యక్తి గాల్లోకి ఎగిరి నేరుగా వ్యాన్‌ లోపలే పడటంతో స్వల్ప గాయాలతో ప్రాణాలతో బయటపడ్డాడు. ఢీకొన్న తీవ్రతకు బైక్ పూర్తిగా ధ్వంసమైంది. దీనికి సంబంధించిన వీడియో దృశ్యాలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా చక్కర్లు కొడుతున్నాయి.


Posted

in

by

Tags: