సోషల్ మీడియా ప్రపంచంలో ఏ క్షణాన ఏది వైరల్ అవుతుందో చెప్పలేము. ప్రతిరోజూ లెక్కలేనన్ని వీడియోలు, ఫోటోలు పోస్ట్ అవుతుంటాయి, అందులో కొన్ని విభిన్నంగా ఉండి అందరి దృష్టిని ఆకర్షిస్తాయి. మీరు గనుక సోషల్ మీడియాలో రెగ్యులర్ గా యాక్టివ్ గా ఉంటే, ఇప్పటికే ఎన్నో రకాల కంటెంట్ చూసి ఉంటారు. ప్రస్తుతం అలాంటి ఒక వింత వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది. అసలు ఆ వీడియోలో ఏముందో తెలుసుకుందాం.
వైరల్ వీడియోలో ఏముంది? ప్రస్తుతం వైరల్ అవుతున్న వీడియోలో ఒక వ్యక్తి నేలపై కూర్చుని తన ముందు రకరకాల నోట్లు, నాణేలను పెట్టుకుని కనిపిస్తాడు. నిజానికి అతను ఆ నోట్లు, నాణేలను అమ్మడానికే అక్కడ కూర్చున్నాడు. అంటే అతని దగ్గర ‘చిల్లర’ (Change) దొరుకుతుంది. మీ దగ్గర 100 రూపాయల నోటు ఉండి, మీకు చిల్లర కావాలంటే అతని దగ్గరకు వెళ్లవచ్చు. అయితే అతను పూర్తి 100 రూపాయలు ఇవ్వడు, కొంత కమిషన్ కట్ చేసుకుని మిగిలిన చిల్లర మీకు ఇస్తాడు. దీనినే అతను ఒక వ్యాపారంగా మార్చుకున్నాడు.
నెటిజన్ల స్పందన: ఈ వీడియోను ఎక్స్ (X) ప్లాట్‌ఫారమ్‌లో @abhinav_blogger అనే అకౌంట్ నుండి పోస్ట్ చేశారు. దీనికి “ఎవరో సరిగ్గా చెప్పారు.. డబ్బు సంపాదించే వ్యక్తి ఎక్కడైనా సంపాదిస్తాడు” అని క్యాప్షన్ ఇచ్చారు. ఈ వీడియోను ఇప్పటికే 20 వేల మందికి పైగా వీక్షించారు. వీడియో చూసిన నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు. ఒక యూజర్ “వేరే వాళ్ళని దోచుకుంటూ.. ఎక్కడ తనే దోపిడీకి గురవుతాడో అని నాకు భయంగా ఉంది” అని కామెంట్ చేయగా, మరో యూజర్ “డబ్బుతోనే డబ్బు సంపాదిస్తారు అని అందరూ ఊరికే అనలేదు” అని రాశారు. ఇంకొకరు “డబ్బుతో డబ్బు సంపాదించడం.. అసలైన బిజినెస్” అని పేర్కొన్నారు.
