వైరల్ వీడియో: నిజంగానే ఆ యువతి తన స్నేహితుడి పేదరికాన్ని ఎగతాళి చేసిందా? ‘పిజ్జా డెలివరీ బాయ్’ వీడియో వెనుక ఉన్న అసలు నిజం ఇదీ!

సోషల్ మీడియాలో కార్చిచ్చులా వ్యాపిస్తున్న ఒక వీడియో కొత్త చర్చకు దారితీసింది. స్కూల్ స్నేహితులు కలిసినప్పుడు పాత జ్ఞాపకాలు గుర్తు చేసుకోవడం సహజం. కానీ, ఈ వీడియోలో ఒక యువతి తన పాత క్లాస్‌మేట్‌ను పిజ్జా డెలివరీ బాయ్‌గా చూసి, అతడిని ప్రోత్సహించడానికి బదులు నడిరోడ్డుపై ఎగతాళి చేస్తున్నట్లు కనిపిస్తోంది. సుమారు 35 సెకన్ల నిడివి ఉన్న ఈ క్లిప్‌ను చూసి నెటిజన్లు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

వీడియోలో ఏముంది? వీడియోలో ఒక డెలివరీ బాయ్ తన పాత స్కూల్ స్నేహితురాలిని కలుస్తాడు. ఆమె వెంటనే ఫోన్ తీసి వీడియో తీస్తూ.. “ఇతడు నా స్కూల్ ఫ్రెండ్. మమ్మల్ని బాగా చదువుకోమని మోటివేట్ చేసేవాడు, ఇప్పుడు డొమినోస్ బాయ్ అయిపోయాడు. డెలివరీ బాయ్‌గా ఎలా ఉంది?” అంటూ వెటకారంగా మాట్లాడటం వినిపిస్తుంది. అయితే, ఈ వీడియో వెనుక ఉన్న అసలు కథ వేరే ఉంది.

నిజం చెప్పిన యువతి: రిషిక (లేదా ఆయుషి సింగ్) అనే కంటెంట్ క్రియేటర్ ఈ వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో షేర్ చేసింది. ఇది వైరల్ అయ్యి విమర్శలు రావడంతో ఆమె మరో వీడియోను విడుదల చేసి క్లారిటీ ఇచ్చింది. “మేము కేవలం సరదా కోసం ఈ వీడియోను స్క్రిప్ట్ చేసి తీశాం. ఇలాంటి కంటెంట్ ప్రస్తుతం వైరల్ అవుతున్నందున మేమూ ప్రయత్నించాం” అని ఆమె పేర్కొంది. సదరు ‘డెలివరీ బాయ్’ కూడా తన స్నేహితుడేనని, తామిద్దరం కలిసి కావాలనే ఈ ప్రాంక్ వీడియో చేశామని స్పష్టం చేశారు.


Posted

in

by

Tags: