వైరల్ వీడియో: పాకిస్థాన్‌లో బైక్ ముందు రాడ్లు ఎందుకు అమర్చుకుంటున్నారు? దీని వెనుక ఉన్న రహస్యం ఏంటి?

సోషల్ మీడియాలో ప్రతిరోజూ ఏదో ఒక వార్త హల్చల్ చేస్తూనే ఉంటుంది. ఈ రోజుల్లో పాకిస్థాన్ నుండి ఒక వీడియో బయటకు వచ్చి అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తోంది. అక్కడి ప్రజలు తమ బైక్‌లకు ఇనుప రాడ్లు లేదా మెటల్ స్టిక్స్‌ను అమర్చుకుంటున్నారు. అసలు దీని వెనుక ఉన్న అసలు కారణం ఏంటో తెలియక నెటిజన్లు తలలు పట్టుకుంటున్నారు.

అసలేం జరిగిందంటే? ఈ వైరల్ వీడియో పాకిస్థాన్‌లోని లాహోర్ నగరానికి చెందింది. అక్కడ వసంత కాలం ప్రారంభం కాగానే ‘బసంత్’ ఉత్సవాలను ఘనంగా జరుపుకుంటారు. ఈ పండుగలో గాలిపటాలు ఎగురవేయడం ప్రధాన ఆకర్షణ. ప్రజలు ఈ పండుగను ఈద్ కంటే ఎక్కువగా ఇష్టపడతారు. అయితే, గాలిపటాల దారం (మాంజా) వల్ల అనేక ప్రమాదాలు జరగడం, చాలా మంది గొంతులు కోసుకుపోయి ప్రాణాలు కోల్పోవడంతో 2005లో ప్రభుత్వం ఈ పండుగపై నిషేధం విధించింది.

కానీ, ఇప్పుడు మళ్ళీ ఈ సంప్రదాయాన్ని ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది. భద్రత కోసం కొన్ని మార్గదర్శకాలను కూడా విడుదల చేసింది. గాలిపటాల దారం బారిన పడకుండా ఉండటానికి, ముఖ్యంగా బైక్ నడిపేవారు తమ ప్రాణాలను రక్షించుకోవడానికి బైక్ ముందు భాగంలో రాడ్లను అమర్చుకుంటున్నారు.

బైక్ ముందు ఇనుప రాడ్ ఎందుకు?

బైక్ వేగంగా వెళ్తున్నప్పుడు రోడ్డుకు అడ్డంగా ఉన్న గాలిపట దారం నేరుగా రైడర్ మెడకు తగిలే అవకాశం ఉంది. ఒకవేళ ఆ దారం బైక్ ముందు భాగానికి వస్తే, అది మొదట ఆ ఇనుప రాడ్‌ను ఢీకొంటుంది. దీనివల్ల దారం పైకి వెళ్ళిపోతుంది లేదా అక్కడే ఆగిపోతుంది, తద్వారా బైక్ నడిపేవారికి ఎలాంటి గాయం కాదు. చాలా మంది ఇప్పుడు తమ వాహనాలకు ఈ రక్షణ కవచాలను వాడుతున్నారు.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. ఇన్‌స్టాగ్రామ్‌లో ‘mr._.aliak’ అనే పేజీలో షేర్ చేసిన ఈ వీడియోను లక్షలాది మంది వీక్షించారు.


Posted

in

by

Tags: