శత్రువులు తప్పుగా అర్థం చేసుకున్నారు.. మాట మార్చిన ఇరాన్ అధ్యక్షుడు! పొరుగు దేశాలకు హెచ్చరిక

టెహ్రాన్: మధ్యప్రాచ్యంలో ఉద్రిక్తతలు కొనసాగుతున్న వేళ, ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియాన్ తన స్వరాన్ని మార్చారు. తమపై దాడులు జరిగితే అంతే తీవ్రంగా బదులిస్తామని హెచ్చరిస్తూనే, యూఏఈ, బహ్రెయిన్, కువైట్ వంటి దేశాల్లో దాడులు జరగడం కలకలం రేపుతోంది.

అసలేం జరిగింది? ఇరాన్ రాజధాని టెహ్రాన్‌లోని ఐదు ఇంధన నిల్వ కేంద్రాలపై ఇజ్రాయెల్ ఈరోజు భారీ వైమానిక దాడులు చేసింది. ఇరాన్‌పై జరిగిన అత్యంత దారుణమైన దాడుల్లో ఇది ఒకటిగా పరిగణించబడుతోంది. చమురు నిల్వలు పేలిపోవడంతో పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఈ దాడి జరిగిన కొన్ని గంటల్లోనే ఇరాన్ అధ్యక్షుడు తన పాత ప్రకటనపై వివరణ ఇచ్చారు.

ఇరాన్ అధ్యక్షుడి వ్యాఖ్యలు: “నా మాటలను శత్రువులు తప్పుగా అర్థం చేసుకున్నారు. మాపై దాడులు జరిగితే ఎదురుదాడి చేయడం తప్ప మాకు మరో మార్గం లేదు. మమ్మల్ని రెచ్చగొడితే ఊరుకోం. మాపై ఒత్తిడి పెరిగే కొద్దీ మా సమాధానం కూడా అంతే కఠినంగా ఉంటుంది. మా దేశం బెదిరింపులకు లేదా దాడులకు ఎప్పుడూ తలవంచదు” అని ఆయన స్పష్టం చేశారు.

గత రెండు రోజుల క్రితం ఆయన మాట్లాడుతూ.. తమ వల్ల ఇబ్బంది పడిన పొరుగు దేశాలకు క్షమాపణలు చెబుతున్నానని, ఇరాన్‌పై దాడులకు తమ భూభాగాన్ని అనుమతించని దేశాలపై దాడులు చేయబోమని ప్రకటించారు. కానీ తాజాగా దుబాయ్ విమానాశ్రయం మరియు మెరీనా ప్రాంతంలోని నివాస భవనాలపై డ్రోన్ దాడులు జరగడం, ఇరాన్ తన మాట తప్పిందనడానికి నిదర్శనంగా కనిపిస్తోంది.


Posted

in

by

Tags: