ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా సజ్జ జావ లేదా సజ్జ సంకటిని తీసుకుంటే శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ కరిగి, శరీరం దృఢంగా మారుతుంది.
కావలసిన పదార్థాలు:
- సజ్జలు: 1 కప్పు
- పాలు: 1 ½ కప్పు
- పెరుగు: ½ కప్పు
- క్యారెట్: 1 (తురిమినది)
- పోపు దినుసులు: ఆవాలు, మినప్పప్పు (1 చెంచా)
- పచ్చిమిర్చి: 1
- ఎండుమిర్చి: 2
- అల్లం: చిన్న ముక్క (తరిగినది)
- ఇంగువ: 1 చిటికెడు
- నూనె, ఉప్పు: తగినంత
- కొత్తిమీర, కరివేపాకు: కొద్దిగా
తయారీ విధానం:
- మొదట అల్లం, పచ్చిమిర్చి, కొత్తిమీరను సన్నగా తరిగి పెట్టుకోవాలి. క్యారెట్‌ను తురుముకోవాలి.
- సజ్జలను శుభ్రం చేసి, మిక్సీలో వేసి మరీ మెత్తగా కాకుండా రవ్వలాగా (బరకగా) పట్టుకోవాలి.
- ఈ సజ్జ రవ్వకు ఐదు కప్పుల నీళ్లు కలిపి, కుక్కర్లో మధ్యస్థ మంట మీద ఉడికించాలి.
- సుమారు 4 విజిల్స్ వచ్చాక దించి, అందులో పాలు పోసి బాగా కలపాలి.
- ఇప్పుడు ఒక బాణలిలో నూనె వేడి చేసి ఆవాలు, మినప్పప్పు, ఇంగువ, కరివేపాకు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, అల్లం వేసి పోపు పెట్టుకోవాలి.
- ఈ పోపును ఉడికించిన సజ్జ మిశ్రమంలో కలపాలి.
- చివరగా తగినంత ఉప్పు, క్యారెట్ తురుము, పెరుగు మరియు అవసరమైతే మరికొన్ని నీళ్లు పోసి, కొత్తిమీర చల్లుకుంటే ఎంతో రుచికరమైన సజ్జ పెరుగు అన్నం సిద్ధం.

Leave a Reply