“శరీర బరువు జెట్ స్పీడ్‌లో తగ్గాలా..?” వారంలో 3 రోజులు ఈ గంజి తాగితే చాలు.. ఇకపై డైట్ బోర్ కొట్టదు..!!

బరువు తగ్గాలని తీవ్రంగా ప్రయత్నించేవారు, డైట్‌లో ఉన్నవారు ఉదయం పూట అల్పాహారంగా రుచిలేని ఆహారాలను తినే బదులు చిరుధాన్యాల ఆహారాన్ని డైట్‌లో చేర్చుకోవచ్చు.

ముఖ్యంగా చిరుధాన్యాలలో ఒకటైన ఊదలలో (Barnyard Millet) పీచుపదార్థం (ఫైబర్), ఐరన్ పుష్కలంగా ఉంటాయి.

ఇది శరీరంలో పేరుకుపోయిన చెడు కొవ్వును వేగంగా కరిగించడానికి ఎంతగానో సహాయపడుతుంది. ఈ ఊదలతో రుచికరమైన గంజి తయారుచేసుకుని వారానికి మూడు సార్లు తాగితే, శరీర బరువులో మంచి మార్పును చూడవచ్చు.

ఈ గంజి తయారు చేయడానికి 1 కప్పు ఊదలు, 2 టీస్పూన్ల నువ్వుల నూనె, అర టీస్పూన్ జీలకర్ర, 15 సన్నగా తరిగిన వెల్లుల్లి రెబ్బలు, కొద్దిగా అల్లం, 2 పచ్చిమిర్చి, కరివేపాకు, 6 కప్పుల నీళ్లు, తగినంత ఉప్పు, మిరియాల పొడి, కొత్తిమీర అవసరం అవుతాయి.

తయారీ విధానం చాలా సులభం; ముందుగా ఊదల బియ్యాన్ని నీటిలో బాగా కడిగి పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత కుక్కర్‌లో నువ్వుల నూనె పోసి జీలకర్ర, వెల్లుల్లి, అల్లం, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి పచ్చివాసన పోయేవరకు బాగా వేయించాలి.

అనంతరం అందులో 6 కప్పుల నీళ్లు, ఉప్పు వేసి మరిగిన తర్వాత.. కడిగి పెట్టుకున్న ఊదలు, మిరియాల పొడి, కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి 5 విజిల్స్ వచ్చేవరకు ఉడికించి దించేస్తే, రుచికరమైన, ఆరోగ్యకరమైన ఊదల గంజి సిద్ధం.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *