లండన్: బ్రిటన్‌లో ఒక 15 ఏళ్ల బాలిక బిడ్డకు జన్మనిచ్చింది. అందరినీ ఆశ్చర్యపరిచే విషయం ఏమిటంటే, తాను గర్భవతిననే విషయం ఆ బాలికకు తెలియదు, పైగా ఆమె ఎప్పుడూ శారీరక సంబంధం కూడా కలిగి లేదు. ఇది ఎలా సాధ్యమైందో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు.
ఆ 15 ఏళ్ల బాలిక తీవ్రమైన కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్ళింది. ఎవరో ఇద్దరు అబ్బాయిలు తన కడుపులో కత్తితో పొడిచారని ఆమె వైద్యులకు చెప్పింది. ఆ బాలికను పరీక్షించిన వైద్యులకు ఒక షాకింగ్ విషయం తెలిసింది. ఆమె జననేంద్రియాలు పూర్తిగా అభివృద్ధి చెందలేదు (Blind Vagina). దాని లోతు కేవలం 2 సెంటీమీటర్లు మాత్రమే. అంటే ఆమె శారీరక సంబంధం (Intercourse) కలిగి ఉండటం సాధ్యం కాదు, కాబట్టి గర్భవతి కావడం కూడా అసాధ్యం.
బ్రిటిష్ జర్నల్ ఆఫ్ అబ్‌స్టెట్రిక్స్ అండ్ గైనకాలజీలో ప్రచురితమైన నివేదిక ప్రకారం, ఆ బాలికకు తన అసాధారణ శరీర నిర్మాణం గురించి తెలుసు. అందుకే ఆమె శారీరక సంబంధానికి బదులుగా ‘ఓరల్ సెక్స్’ను ఆశ్రయించేది. ఆమెకు ఎప్పుడూ పీరియడ్స్ (Periods) రాలేదు, అందుకే తాను గర్భవతిని అని ఆమె ఊహించలేదు. తొమ్మిది నెలల పాటు కడుపు పెరిగినా, అది గర్భం అని ఆమె గుర్తించలేకపోయింది.
ఆ బాలిక ఓరల్ సెక్స్ ద్వారా గర్భం దాల్చిందని వైద్యులు నిర్ధారించారు. ఇది ఎలా జరిగిందని ఆమె ఆశ్చర్యపోగా, వైద్యులు దీని వెనుక ఉన్న శాస్త్రీయ కారణాన్ని వివరించారు. ఒకవేళ ఆ బాలిక కడుపుపై ఉన్న గాయం ద్వారా లేదా ఇతర మార్గాల ద్వారా శుక్రకణాలు (Spermatozoa) పునరుత్పత్తి అవయవాలకు చేరుకుని ఉండవచ్చునని వైద్యులు భావించారు. ఆమె కడుపుపై ఉన్న కత్తి గాయం వల్ల సర్జరీ జరిగిన సమయంలో ఆమె కడుపు ఖాళీగా ఉంది, అంటే శరీరంలో యాసిడ్ (Acid) ఉత్పత్తి కాలేదు. అటువంటి సమయంలో లాలాజలం (Saliva) సహాయంతో శుక్రకణాలు లోపలికి ప్రవేశించి ఉండవచ్చని, అందుకే ఆమె శారీరక సంబంధం లేకుండానే తల్లి కాగలిగిందని వైద్యులు పేర్కొన్నారు.
