షాకింగ్… పాలు తాగుతూ ఊపిరాడక పసిబిడ్డ మృతి!

చెన్నైలోని మాంగాడు ప్రాంతంలో కేవలం పది రోజుల వయసున్న మగబిడ్డ, తల్లి పాలు తాగుతున్న సమయంలో ఊపిరాడక మరణించిన ఘటన తీవ్ర విషాదాన్ని నింపింది.

మాంగాడు కీల్ రఘునాథపురం ప్రాంతానికి చెందిన ఇమ్రాన్ (30), శ్రీదేవి (26) దంపతులకు పది రోజుల క్రితమే మగబిడ్డ జన్మించాడు. ఎప్పటిలాగే శ్రీదేవి బాబుకు పాలు ఇచ్చి నిద్రపుచ్చడానికి ప్రయత్నిస్తుండగా, అకస్మాత్తుగా బిడ్డకు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడం గమనించింది. బాబు నీరసించిపోవడంతో కంగారుపడ్డ తల్లిదండ్రులు వెంటనే 108 అంబులెన్స్‌కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది బాబును పూందమల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు బాబు అప్పటికే మరణించినట్లు ధృవీకరించారు.

ఈ ఘటనపై మాంగాడు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం తరలించారు. బిడ్డ మరణానికి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు.


Posted

in

by

Tags: