షాకింగ్: రీల్స్ చూసి జననేంద్రియ మార్గంలో ‘మొబైల్ ఛార్జర్’ పెట్టుకున్న బాలుడు.. వైద్యులే షాక్!

వియత్నాంలోని హో చి మిన్ సిటీలో 16 ఏళ్ల బాలుడు వింత అనుభవం కోసం సోషల్ మీడియా వీడియోలను చూసి, తన జననేంద్రియ మార్గం ద్వారా మూత్రాశయం లోపలికి ఫోన్ ఛార్జర్ వైరును పంపిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది.

ఏం జరిగింది?

డిసెంబర్ 7న వైద్యులు శస్త్రచికిత్స చేసి ఆ ఛార్జర్‌ను విజయవంతంగా తొలగించారు. ఆ బాలుడు ఆన్‌లైన్‌లో ఒక వీడియో చూసి, ఉత్సుకతతో ఫోన్ ఛార్జర్ వైరును తన మూత్రనాళం లోపలికి పంపాడు. అది లోపల ఇరుక్కుపోయి తీవ్రమైన నొప్పి కలిగించినప్పటికీ, భయంతో ఆ విషయాన్ని ఎవరికీ చెప్పలేదు.

వైద్యుల పరీక్షలో విస్తుపోయే నిజం

బాలుడు అనుభవిస్తున్న నొప్పిని చూసి కుటుంబ సభ్యులు కంగారుపడి ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షలు నిర్వహించగా, మూత్రాశయంలో ఛార్జర్ వైరు ఉన్నట్లు గుర్తించి అవాక్కయ్యారు. ఆన్ బిన్ హాస్పిటల్ వైద్యులు వెంటనే స్పందించి సుమారు రెండు గంటల పాటు శస్త్రచికిత్స చేసి దానిని బయటకు తీశారు.

శస్త్రచికిత్సలో ఎదురైన ఇబ్బందులు

మొదట వైద్యులు 30 నిమిషాల పాటు ఎండోస్కోపిక్ శస్త్రచికిత్స చేయడానికి ప్రయత్నించారు. అయితే ఆ వైరు లోపల చుట్టలు చుట్టుకుని ఉండటంతో ప్రక్రియ చాలా క్లిష్టంగా మారింది. అంతేకాకుండా, ఆ వైరు వల్ల మూత్రాశయంలోని కొంత భాగం దెబ్బతిని ఇన్ఫెక్షన్ సోకడం (కుళ్లిపోవడం) కూడా వైద్యులు గమనించారు. చివరకు కష్టమ్మీద శస్త్రచికిత్స పూర్తి చేసి ఛార్జర్‌ను తొలగించారు. రెండు రోజుల తర్వాత ఆ బాలుడికి కౌన్సెలింగ్ ఇచ్చి డిశ్చార్జ్ చేశారు.


Posted

in

by

Tags: