ఒకప్పుడు క్రికెట్ ప్రపంచాన్ని గడగడలాడించిన పాకిస్థాన్ జట్టు బ్యాటింగ్ లైనప్‌లో అత్యంత కీలకమైన పేరు.. ఎడమచేతి వాటం ఓపెనర్ సయీద్ అన్వర్.
తన ఖచ్చితమైన, క్లాసిక్ షాట్లతో బౌలర్లను ముప్పుతిప్పలు పెట్టిన అన్వర్, ఒకప్పుడు వన్డే క్రికెట్లో ప్రపంచ రికార్డు సృష్టించారు. సచిన్ టెండూల్కర్ ఆ రికార్డును బద్దలు కొట్టే వరకు, వన్డేల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరు (194 పరుగులు) రికార్డును సుదీర్ఘ కాలం పాటు తన పేరిటే ఉంచుకున్నారు. తన అద్భుతమైన బ్యాటింగ్‌తో పాకిస్థాన్ తరపున 55 టెస్టులు, 247 వన్డేలు ఆడి జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించారు.
క్రికెట్ మైదానంలో ఆయన ప్రయాణం ఇంత గొప్పగా సాగినప్పటికీ, వ్యక్తిగత జీవితం మాత్రం సుఖదుఃఖాల కలయికగా మారింది. 1996లో తన బంధువైన డాక్టర్ లుబ్నాను ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆమెతో అన్వర్ వైవాహిక జీవితం ఎంతో సంతోషంగా సాగుతున్న తరుణంలో, వారికి జన్మించిన ‘బిస్మా’ అనే కుమార్తె తీవ్ర అనారోగ్యానికి గురవడం ఆ కుటుంబ ఆనందాన్ని కుదిపేసింది.
బంగ్లాదేశ్‌తో సిరీస్ జరుగుతున్న సమయంలో, ఆయన గారాలపట్టి అనారోగ్యంతో కన్నుమూసింది. ఈ విషాదం అన్వర్ జీవిత గమనాన్నే పూర్తిగా మార్చేసింది. కూతురి మరణాన్ని తట్టుకోలేక మానసికంగా కుంగిపోయిన ఆయన, ఆధ్యాత్మిక మార్గం వైపు మళ్లారు. ఆ తర్వాత గడ్డం పెంచి ఇస్లామిక్ మతబోధకుడిగా మారారు. క్రికెట్‌కు వెలుపల నిజ జీవితంలో ఇంతటి కఠిన పరీక్షలను ఎదుర్కొన్న ఈ దిగ్గజ ఆటగాడి కథ, నేటికీ

Leave a Reply