సచిన్ 22 ఏళ్ల ప్రపంచ రికార్డు బద్దలు.! 39 ఏళ్ల వయసులో మాస్టర్ బ్లాస్టర్ రికార్డును బ్రేక్ చేసిన హిట్‌మ్యాన్. జెట్ వేగంతో 10,000. కొత్త చరిత్ర సృష్టించిన రోహిత్ శర్మ.!

భారత క్రికెట్ జట్టు కెప్టెన్ ‘హిట్‌మ్యాన్’ రోహిత్ శర్మ, అంతర్జాతీయ వన్డేల్లో ఓపెనర్‌గా అత్యంత వేగంగా (అతి తక్కువ ఇన్నింగ్స్‌లలో) 10,000 పరుగులు పూర్తి చేసి కొత్త చారిత్రక రికార్డును నెలకొల్పాడు.

వెస్టిండీస్‌తో ముల్లాన్‌‌పూర్‌లో జరిగిన 3వ వన్డే మ్యాచ్‌లో రోహిత్ శర్మ ఈ అద్భుతమైన మైలురాయిని చేరుకున్నాడు.

ఓపెనర్‌‌గా 10,000 పరుగులు చేయడానికి అతను కేవలం 202 ఇన్నింగ్స్‌లు మాత్రమే తీసుకున్నాడు. దీని ద్వారా, మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ (214 ఇన్నింగ్స్‌లు) 2004లో సృష్టించిన 22 ఏళ్ల నాటి రికార్డును బద్దలుకొట్టి, ప్రపంచంలోనే అత్యంత వేగంగా 10,000 వన్డే పరుగులు చేసిన ఓపెనర్‌‌గా రోహిత్ ఘనత సాధించాడు.

2013లో ఓపెనర్‌గా బాధ్యతలు చేపట్టినప్పటి నుండి, ప్రత్యర్థి బౌలర్లను నలుదిక్కులా చెదరగొడుతున్న రోహిత్ శర్మ.. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక ఆటగాడిగా కూడా ప్రత్యేక ప్రపంచ రికార్డును తన పేరిట లిఖించుకున్నాడు. అంతేకాకుండా, ఇదే సిరీస్‌లో జరిగిన 2వ వన్డేలో తన 35వ వన్డే సెంచరీని నమోదు చేయడంతో పాటు, అంతర్జాతీయ వన్డే క్రికెట్‌లో మొత్తంగా 12,000 పరుగులు కూడా పూర్తి చేసి అదరగొట్టాడు. 39 ఏళ్ల వయసులోనూ అతని అద్భుతమైన ఫామ్, అటాకింగ్ బ్యాటింగ్ ప్రపంచ క్రికెట్ అభిమానులను ఆశ్చర్యపరుస్తోంది.


Posted

in

by

Tags: