“సూట్‌కేసులో కుళ్ళిపోయిన మహిళ మృతదేహం..!” 5 ఏళ్లుగా పోలీసుల కళ్ళుగప్పిన కిరాతకురాలు అరెస్ట్.. గుర్తింపు మార్చుకుని 2వ పెళ్లి.. రహస్యంగా జీవిస్తున్న బంగ్లాదేశ్ మహిళ ఎలా చిక్కింది..??

సేలం ప్రాంతంలో బ్యూటీ పార్లర్ నడుపుతున్న బంగ్లాదేశ్‌కు చెందిన తేజ్‌మండల్ అనే మహిళ, 2021 అక్టోబర్‌లో తన అద్దె ఇంట్లో కాళ్లు చేతులు కట్టేసి, నోట్లో గుడ్డలు కుక్కిన స్థితిలో దారుణంగా హత్యకు గురైంది.

ఆమె మృతదేహాన్ని ఒక పెద్ద సూట్‌కేసులో కుక్కిన స్థితిలో, పూర్తిగా కుళ్ళిపోయిన దశలో గుర్తించడం అప్పట్లో ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

ఈ హత్యకు సంబంధించి అస్తంపట్టి పోలీసులు జరిపిన లోతైన విచారణలో.. తేజ్‌మండల్ వద్ద పనిచేసిన బంగ్లాదేశ్‌ జాతీయులైన లబ్లూ, అతని భార్య నిషి, షీలా, ఓషి అనే నలుగురికి ఈ దారుణంతో సంబంధం ఉన్నట్లు తేలింది. జీతాల బకాయిల వివాదం మరియు అక్రమ సంబంధం పట్ల ఉన్న కోపంతో పాటు, తేజ్‌మండల్ వద్ద ఉన్న నగలు, డబ్బును దోచుకోవాలని పథకం పన్ని వీరు ఈ హత్యకు పాల్పడ్డారు.

పథకం ప్రకారం నలుగురు కలిసి తేజ్‌మండల్‌ను చీరతో కట్టేసి, నోట్లో గుడ్డ కుక్కి ఊపిరి ఆడకుండా చేసి హత్య చేశారు. ఆ తర్వాత మృతదేహాన్ని సూట్‌కేసులో కుక్కి, డబ్బు నగలతో పరారయ్యారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు హంతకులను గుర్తించినప్పటికీ, అప్పటికే వారు బెంగళూరు మీదుగా బంగ్లాదేశ్‌కు పారిపోయి తలదాచుకున్నారు.

గత 5 ఏళ్లుగా పోలీసులకు చిక్కకుండా ఉన్న నిషి, తన గుర్తింపును మార్చుకుని మళ్లీ రహస్యంగా భారత్‌లోకి ప్రవేశించింది. పూణేలో ఉంటున్న ఆమె, పరశురామ్ అనే వ్యక్తిని రెండో వివాహం చేసుకుని ఒక ఆడపిల్లతో కుటుంబ జీవనం సాగిస్తున్నట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

దీంతో సేలం సిటీ పోలీస్ కమిషనర్ ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక పోలీసు బృందం.. పక్కా సమాచారంతో పూణే వెళ్లి నిషిని అరెస్టు చేసింది. ఆమెను సేలం తీసుకువచ్చి కోర్టులో హాజరుపరిచి జైలుకు తరలించిన పోలీసులు, పరారీలో ఉన్న మిగతా ముగ్గురి కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *