సోదరి ఆడపడుచుతో వివాహేతర సంబంధం.. 15 రోజులు ఊరు తిరిగి వచ్చినా తీరని మోజు.. ఏకాంతంగా ఉండగా పట్టుకున్న గ్రామస్థులు.. సగం గుండు గీసి, ముఖానికి మసి పూసి, మూత్రం తాగించి దారుణ దాడి.. తీవ్ర కలకలం!

ఉత్తరప్రదేశ్‌లోని అలీగఢ్‌లో ఒక యువకుడికి తాలిబన్ తరహాలో శిక్ష విధించిన షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది.

బంజారా ప్రాంతంలోని సాత్‌పయ్యా అనే గ్రామంలో ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.

గత సెప్టెంబర్ 24న ఖైర్ ప్రాంతానికి చెందిన ఓ యువకుడు తన సోదరి అత్తగారింటికి వచ్చాడు. ఆ సమయంలో, ఆ యువకుడికి మరియు అతని సోదరి ఆడపడుచుకు (భర్త సోదరి) మధ్య వివాహేతర సంబంధం ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఇద్దరికీ ముందే పెళ్లై, పిల్లలు కూడా ఉన్నారు.

కొన్ని నెలల క్రితం వీరిద్దరూ ఇంటి నుంచి పారిపోయి, 15 రోజుల తర్వాత తిరిగి వచ్చినప్పుడు గ్రామ పంచాయతీ వారిని మందలించి పంపించేసింది. ఈ క్రమంలో ఘటన జరిగిన రోజు పశువులను మేపేందుకు అడవికి వెళ్లిన కొందరు గ్రామస్థులు.. ఆ యువకుడు, మహిళ ఏకాంతంగా ఉండటాన్ని చూశారు. దీంతో ఆగ్రహించిన గ్రామస్థులు వెంటనే ఆ యువకుడిని పట్టుకుని బందీగా చేశారు.

ఆ తర్వాత ఆ యువకుడికి సగం గుండు గీసి, గడ్డం, మీసాలు పూర్తిగా తొలగించారు. అనంతరం అతని ముఖానికి నల్లటి మసి పూసి, అక్కడున్న ఓ చెట్టుకు కట్టేసి చెప్పులతో విపరీతంగా కొట్టి హింసించారు. అంతటితో ఆగకుండా అతనికి బలవంతంగా మూత్రం తాగించి పైశాచికంగా ప్రవర్తించారు. అక్కడున్న ఆ మహిళను కూడా గ్రామస్థులు తీవ్రంగా అవమానించారు.

ఈ దారుణమైన చిత్రహింసలన్నింటినీ కొందరు వీడియో తీసి శనివారం సోషల్ మీడియాలో పోస్ట్ చేయగా, ఆ వీడియో దావానలంలా వైరల్‌గా మారింది. వీడియో ఆధారంగా వెంటనే రంగంలోకి దిగిన అక్రాబాద్ పోలీస్ ఇన్‌స్పెక్టర్ పంకజ్ కుమార్ మిశ్రా నేతృత్వంలోని పోలీసులు, కేసు నమోదు చేసి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ఈ దారుణ ఘటనలో పాల్గొన్న 4 మహిళలు సహా 7 మందిని పోలీసులు అరెస్టు చేసి జైలుకు తరలించారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *