“స్నాప్‌చాట్‌లో పుట్టిన ప్రేమ..!” బ్లాక్‌మెయిల్ చేసి 12వ తరగతి విద్యార్థినిపై అఘాయిత్యం.. ట్యూషన్ అని చెప్పి హోటల్‌కు వెళ్లడంతో అనర్థం.. ఆన్‌లైన్ పరిచయంతో నాశనమైన విద్యార్థిని జీవితం..!!

మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని గ్వాలియర్‌లో ‘స్నాప్‌చాట్’ (Snapchat) సోషల్ మీడియా వేదికగా పరిచయమైన ఓ వ్యక్తి, 12వ తరగతి చదువుతున్న పాఠశాల విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడిన ఘటన తీవ్ర కలకలం రేపింది.

బాధిత విద్యార్థినికి సుమారు ఏడాది క్రితం కృష్ణ ఖత్వానీ అనే వ్యక్తితో స్నాప్‌చాట్ ద్వారా పరిచయం ఏర్పడింది. క్రమంగా వీరిద్దరి మధ్య మాటలు పెరగడంతో, గత సెప్టెంబర్ 22వ తేదీ సాయంత్రం తనను నేరుగా కలవాలని ఆ వ్యక్తి విద్యార్థినిని పిలిచాడు.

ఆ విద్యార్థిని కూడా ట్యూషన్‌కు వెళ్తున్నానని ఇంట్లో అబద్ధం చెప్పి అతడిని కలవడానికి వెళ్లింది. అక్కడికి వచ్చిన ఆ వ్యక్తి, విద్యార్థినిని సమీపంలోని ఓ హోటల్‌కు బలవంతంగా తీసుకెళ్లాడు.

హోటల్ గదిలో విద్యార్థిని ప్రతిఘటించినప్పటికీ, ఆమె అశ్లీల ఫోటోలు, వీడియోలను ఇంటర్నెట్‌లో పెడతానని, ఆమె తండ్రికి హాని తలపెడతానని బెదిరించి తన పైశాచికత్వాన్ని ప్రదర్శించాడు. దీంతో భయపడిపోయిన ఆ విద్యార్థిని, ఇంటికి వచ్చి కుటుంబ సభ్యుల వద్ద బోరున విలపించింది.

మొదట కుటుంబ సభ్యులు భయపడినప్పటికీ, ఆ తర్వాత ధైర్యం చేసి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీని ఆధారంగా పోలీసులు ‘పోక్సో’ (POCSO), లైంగిక దాడి కింద కేసు నమోదు చేసి, పరారీలో ఉన్న ఆ నిందితుడి కోసం ముమ్మరంగా గాలిస్తున్నారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *