స్నేహితుడితో కలిసి వస్తున్న విద్యార్థిని..! అసభ్యంగా తాకుతూ 20 నిమిషాల పాటు నరకం చూపించిన దుండగుల ముఠా. భయపడిపోయిన కుటుంబం.. వైరల్ వీడియోతో రంగంలోకి దిగిన పోలీసులు.!!

బీహార్ రాష్ట్రం జముయ్ ప్రాంతంలో, 10వ తరగతి చదువుతున్న ఓ విద్యార్థినిని నడిరోడ్డుపై అడ్డగించిన ఓ దుండగుల మూక, ఆమెను అసభ్యంగా తాకుతూ, లాక్కెళ్లి లైంగిక వేధింపులకు గురిచేస్తున్న రెండు వీడియోలు సోషల్ మీడియాలో విడుదలై తీవ్ర కలకలం రేపుతున్నాయి.

గత సెప్టెంబర్ 19న కోచింగ్ క్లాస్ ముగించుకుని తన స్నేహితుడితో కలిసి స్కూటీపై తిరిగి వస్తున్న విద్యార్థినిని అడ్డగించిన ఆ ముఠా, ఆమెతో ఉన్న అబ్బాయిని పక్కకు నెట్టేసి, బాలికను చుట్టుముట్టి సుమారు 20 నిమిషాల పాటు దారుణంగా వేధింపులకు గురిచేశారు. అక్కడున్న కొందరు స్థానికులు ఆమెను కాపాడేందుకు ప్రయత్నించినప్పటికీ, ఆ గుంపు తమ దౌర్జన్యాన్ని ఏమాత్రం ఆపలేదు.

బాధిత బాలిక కుటుంబ సభ్యులు భయంతో మొదట పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. అయితే, ఈ దారుణ ఘటనకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ కావడంతో స్పందించిన జముయ్ టౌన్ పోలీసులు వెంటనే సుమోటోగా (స్వచ్ఛందంగా) కేసు నమోదు చేశారు. వీడియో ఆధారాల ద్వారా నిందితులను గుర్తించి, వారిని అరెస్టు చేసేందుకు ముమ్మర చర్యలు చేపడుతున్నట్లు జముయ్ ఎస్పీ విశ్వజిత్ దయాల్ తెలిపారు.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *