మహారాష్ట్ర ఛత్రపతి శంభాజీనగర్ రైల్వే స్టేషన్ పరిధిలోని ఒక లాడ్జిలో వివాహితపై ముగ్గురు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన దిగ్భ్రాంతికర ఘటన వెలుగులోకి వచ్చింది. బాధితురాలికి బలవంతంగా బీరు తాగించి రాత్రంతా ఆమెపై అకృత్యాలకు పాల్పడ్డారు.
అసలేం జరిగింది?
30 ఏళ్ల బాధిత మహిళకు డబ్బు అవసరం ఉండి తన స్నేహితుడిని సహాయం కోరింది. బుధవారం రాత్రి ఆ స్నేహితుడు ఆమెను రైల్వే స్టేషన్ సమీపంలోని ఒక హోటల్‌కు రమ్మన్నాడు. వారు 105 నంబర్ గదిలో భోజనం చేసి, మద్యం సేవించారు. రాత్రి 11 గంటల సమయంలో సదరు మహిళ ఫోన్ మాట్లాడుతూ గది బయటకు వచ్చింది. ఫోన్ మాట్లాడటం అయిపోయిన తర్వాత తిరిగి వెళ్తూ.. పొరపాటున 105 గదికి బదులుగా 205 నంబర్ గది తలుపు తట్టింది.
నిందితుల క్రూరత్వం:
ఆ గదిలో అప్పటికే మద్యం తాగుతున్న ముగ్గురు వ్యక్తులు.. ఆమెను లోపలికి లాగి తలుపులు వేశారు. ఆమెకు బలవంతంగా బీరు తాగించి, ముగ్గురూ వంతులవారీగా ఆమెపై అత్యాచారం చేశారు. తెల్లవారుజామున 3 నుండి 4 గంటల మధ్యలో ఆమె నిందితుల నుండి తప్పించుకుని, గది తలుపులు తీసి గట్టిగా కేకలు వేసింది. ఆ తర్వాత నేరుగా వేదాంత్నగర్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేసింది.
3 గంటల్లోనే అరెస్ట్:
ఫిర్యాదు అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగారు. హోటల్ బుకింగ్ వివరాలు మరియు సిసిటివి (CCTV) ఫుటేజ్ ఆధారంగా కేవలం 3 గంటల్లోనే ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు.
- నిందితుల వివరాలు: ఘనశ్యామ్ భౌలాల్ రాథోడ్ (27), రిషికేశ్ తులసీరామ్ చవాన్ (25), కిరణ్ లక్ష్మణ్ రాథోడ్ (25).
- వీరిలో ఇద్దరు ఫైనాన్స్ కంపెనీలో రికవరీ ఏజెంట్లుగా పనిచేస్తుండగా, ఒకరు ప్రైవేట్ ఉద్యోగం చేస్తూ చదువుకుంటున్నారు. వీరంతా అవివాహితులే.
