“స్లీపర్ బస్సులో ఇంతటి దారుణమా?”.. బస్సులో పాఠశాల విద్యార్థినిపై ఘోరం.. డ్రైవర్, కండక్టర్ అరెస్ట్..!!!!

దేశ రాజధాని ఢిల్లీలో 16 ఏళ్ల పాఠశాల విద్యార్థినిపై కదులుతున్న స్లీపర్ బస్సులో సామూహిక లైంగిక దాడికి పాల్పడిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దిగ్భ్రాంతిని, ఆగ్రహావేశాలను రేకెత్తించింది.

ప్రజల భద్రతను ప్రశ్నార్థకం చేస్తూ జరిగిన ఈ దారుణ ఘటనపై సమాచారం అందిన వెంటనే పోలీసులు రంగంలోకి దిగి ముమ్మర దర్యాప్తు చేపట్టారు. ఈ నేరంలో ప్రత్యక్ష ప్రమేయం ఉన్న బస్సు డ్రైవర్, కండక్టర్ ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు.

నేరానికి ఉపయోగించిన ఆ స్లీపర్ బస్సును ఢిల్లీ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అంతేకాకుండా, ఆధారాలను శాస్త్రీయంగా నిర్ధారించేందుకు ఆ బస్సును ఫోరెన్సిక్ పరీక్షల నిమిత్తం పంపినట్లు పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు.

మైనర్ బాలికపై జరిగిన ఈ ఘాతుకం స్థానిక ప్రజలను, సామాజిక కార్యకర్తలను తీవ్ర ఆగ్రహానికి గురిచేయడంతో పాటు నిందితులకు చట్ట ప్రకారం కఠిన శిక్ష విధించాలనే డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. దేశ రాజధానిలో మహిళలపై నేరాలు రోజురోజుకూ పెరిగిపోతుండటం ప్రజల్లో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *