హద్దు మీరిన ట్రంప్.. ప్రైవేట్ భాగంపై కొరికిన బాలిక.. షాకింగ్ వివరాలు వెల్లడించిన ‘ఎప్స్టీన్ రిపోర్ట్’!

వాషింగ్టన్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌ను ఇరకాటంలో పెట్టే విస్మయకర విషయాలు ఇప్పుడు బయటకు వచ్చాయి. ఒక మైనర్ బాలిక పట్ల ట్రంప్ అసభ్యంగా ప్రవర్తించారని, ఆ సమయంలో ఆ బాలిక ఆయన ప్రైవేట్ భాగంపై కొరికిందని ఆ నివేదికలో పేర్కొన్నారు. అంతర్జాతీయంగా సంచలనం సృష్టించిన లైంగిక నేరగాడు జెఫ్రీ ఎప్స్టీన్ కేసు దర్యాప్తుకు సంబంధించిన పత్రాలు (Epstein Files) విడుదల కావడంతో ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయి.

ముఖ్యమైన విషయాలు:

  • FBI పత్రాల వెల్లడి: దాదాపు 25 ఏళ్ల క్రితం న్యూజెర్సీలో జరిగిన ఒక ఘటనపై ఒక మహిళ FBIకి వాంగ్మూలం ఇచ్చింది. అప్పుడు 13-14 ఏళ్ల వయసున్న తన స్నేహితురాలిని ట్రంప్ లైంగికంగా వేధించారని ఆమె పేర్కొంది.
  • తిరగబడ్డ బాలిక: నివేదిక ప్రకారం, ట్రంప్ తనపై అత్యాచారానికి ప్రయత్నించినప్పుడు ఆ బాలిక ప్రతిఘటించి, ఆయన ప్రైవేట్ భాగంపై కొరికింది. ఆ తర్వాత ఆమె నవ్వడంతో అక్కడ ఉన్న కొందరు ఆమెపై దాడి చేశారని ఆ మహిళ తన వాంగ్మూలంలో తెలిపింది.
  • ఎప్స్టీన్-ట్రంప్ సంబంధం: ఎప్స్టీన్‌తో తనకు పెద్దగా పరిచయం లేదని ట్రంప్ చెబుతున్నప్పటికీ, అమెరికా న్యాయశాఖ విడుదల చేసిన ఈ పత్రాలు వారి మధ్య సన్నిహిత సంబంధం ఉందని సూచిస్తున్నాయి.

ప్రభుత్వ వివరణ: ఈ ఆదారాలు ఆన్‌లైన్‌లో కనిపించిన కొద్దిసేపటికే మాయమవ్వడంపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయితే, సర్వర్ ఓవర్‌లోడ్ కావడం వల్లే అలా జరిగిందని, తాము వేటినీ తొలగించలేదని అమెరికా న్యాయశాఖ వివరణ ఇచ్చింది.


Posted

in

by

Tags: