“హాట్రిక్ రికార్డు!”.. మూడోసారి జాతీయ అవార్డును గెలుచుకున్న జి.వి. ప్రకాష్.. భావోద్వేగ పోస్ట్ వైరల్..!!!!

అమరన్’ చిత్రానికి గాను ఉత్తమ నేపథ్య సంగీతం (Best Background Score) విభాగంలో 72వ జాతీయ చలనచిత్ర అవార్డును గెలుచుకున్న సంగీత దర్శకుడు జి.వి. ప్రకాష్ కుమార్, తన ఆనందాన్ని భావోద్వేగంతో పంచుకున్నారు.

తన సినీ ప్రస్థానంలో మూడోసారి జాతీయ అవార్డును అందుకోవడం ఒక గొప్ప ఆశీర్వాదంగా భావిస్తున్నానని పేర్కొన్న ఆయన, తనకు ఇలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన నిర్మాత కమల్ హాసన్ మరియు దర్శకుడు రాజ్‌కుమార్ పెరియసామిలకు తన హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు.

ఈ గుర్తింపు తనకు మరింత ఉత్సాహాన్ని ఇస్తోందని చెప్పిన జి.వి. ప్రకాష్, తన విజయానికి కారణమైన శివకార్తికేయన్, సాయి పల్లవి, సాంకేతిక నిపుణుల బృందం, తన కుటుంబ సభ్యులు మరియు తనకు ఎల్లప్పుడూ మద్దతుగా నిలిచే అభిమానులకు ఈ అవార్డును అంకితం ఇస్తున్నట్లు ఎమోషనల్‌గా పోస్ట్ చేశారు.


Posted

in

by

Tags: