గోరఖ్‌పూర్ రైల్వే స్టేషన్‌లో చోటుచేసుకున్న ఈ ఘటన, మాతృప్రేమకు మనుషులు, జంతువులు అనే తేడా ఏదీ ఉండదని ఎంతో అందంగా చాటిచెబుతోంది.
అక్కడున్న ఒక మహిళా పోలీసు అధికారిణి, సరదాగా ఒక చిన్న కుక్కపిల్లను తన వెనుక దాచిపెట్టారు. కాసేపటికే తన బిడ్డ కనిపించకపోవడంతో కంగారుపడిన తల్లి కుక్క, అటూఇటూ వెతుకుతూ ఆ అధికారిణి ఉన్న చోటుకే చేరుకుంది.
తన బిడ్డ ఆ మహిళా పోలీస్ వద్దే ఉందన్న విషయాన్ని పసిగట్టినట్లుగా, ఆ తల్లి కుక్క ఆమె చుట్టూ తిరుగుతూ బతిమాలడం మొదలుపెట్టింది. బిడ్డ కోసం తల్లడిల్లే తల్లి ఆవేదన ఆ మూగజీవి ప్రతి కదలికలోనూ స్పష్టంగా కనిపించింది. ఆ ప్రాంతాన్ని విడిచి వెళ్లకుండా, ఆ అధికారిణినే నమ్ముతూ ఆమె కాళ్ల చుట్టూ తిరిగిన తీరు అక్కడున్న వారందరి దృష్టిని ఆకర్షించింది.
చివరికి, ఆ మహిళా పోలీసు దాచిపెట్టిన కుక్కపిల్లను బయటకు తీసి తల్లికి అప్పగించారు. తన బిడ్డను చూడగానే ఆ తల్లి కుక్క భయం, బెంగ క్షణాల్లో మాయమై ఎంతో సంబరపడిపోయింది. కన్న బిడ్డ మనుషులదైనా, జంతువులదైనా.. అమ్మ ప్రేమ ఎప్పటికీ ఒక్కటేనని చెప్పేందుకు ఈ ఘటనే ఒక గొప్ప నిదర్శనం.

Leave a Reply