కేరళ కొట్టాయం: నగరంలోని ఒక హోటల్ గదిలో యువతీయువకులు మృతి చెంది ఉండటం కలకలం రేపింది. కొట్టాయం పట్టణ కేంద్రంలోని శాస్త్రి రోడ్డులో ఉన్న ‘నిషా కాంటినెంటల్’ హోటల్లో ఈ ఘటన జరిగింది.
వివరాలు: మృతులను కుడయంపడికి చెందిన ఆసియా (20), పుతుపల్లికి చెందిన నందకుమార్ (22)గా గుర్తించారు. హోటల్లోని గది సంఖ్య 202లో వీరిద్దరూ ఫ్యాన్‌కు ఉరివేసుకున్న స్థితిలో కనిపించారు. గురువారం సాయంత్రం వీరు హోటల్లో గది తీసుకున్నారు. అయితే, శుక్రవారం సాయంత్రం వరకు వారు బయటకు రాకపోవడంతో అనుమానం వచ్చిన హోటల్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు.
కొట్టాయం వెస్ట్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని తలుపులు పగులగొట్టి చూడగా, ఇద్దరూ విగతజీవులుగా పడి ఉన్నారు. ఆసియా కనిపించడం లేదని ఆమె కుటుంబ సభ్యులు ఇప్పటికే గాంధీనగర్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
