ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలోని ఝాన్సీలో ఒక వింత ఘటన వెలుగు చూసింది. భార్యాభర్తల మధ్య ఉన్న కుటుంబ తగాదాల నేపథ్యంలో, భార్య తన ప్రియుడితో కలిసి హోటల్ గదిలో దొరికిపోవడం స్థానికంగా కలకలం రేపింది. నవాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గెస్ట్ హౌస్‌లో ఈ ‘హై వోల్టేజ్’ డ్రామా చోటుచేసుకుంది.
జనవరి 11వ తేదీన తన భార్య వేరే యువకుడితో కలిసి వెళ్తున్నట్లు భర్తకు రహస్య సమాచారం అందింది. దీంతో అనుమానం వచ్చిన ఆయన ఆమెను వెంబడించారు. బస్టాండ్ సమీపంలోని ఒక హోటల్లో రూమ్ నంబర్ 103 బుక్ చేసుకుని భార్య, ప్రియుడు లోపలికి వెళ్లారు. వెంటనే భర్త ‘112’ నంబర్‌కు కాల్ చేసి పోలీసులకు సమాచారం అందించారు.
పోలీసులు అక్కడికి చేరుకోకముందే హోటల్లో భార్యాభర్తల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. పోలీసులు లోపలికి రావడం చూసిన ప్రియుడు భయంతో బెడ్ కింద దాక్కున్నాడు. సోదాలు చేసిన పోలీసులు బెడ్ కింద ఉన్న యువకుడిని బయటకు లాగి విచారణకు తరలించారు.
బాధిత భర్త పోలీసులతో మాట్లాడుతూ.. “మాకు 3 ఏళ్ల క్రితం పెళ్లయింది. ఏడాది కాలంగా నా భార్య నాతో ఉండటం లేదు. ఒక స్కూల్లో పని చేస్తూ ఈ యువకుడితో తిరుగుతోంది. విడాకులు కావాలంటే రూ. 10 లక్షలు ఇవ్వాలని నన్ను బెదిరిస్తోంది” అని ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే ఆ మహిళ మాత్రం పోలీసుల ముందే తెగేసి చెప్పింది.. “నేను చాలా కాలంగా నా భర్తతో ఉండటం లేదు. నా ఇష్టప్రకారం జీవించే హక్కు నాకుంది. నా ప్రియుడితోనే కలిసి ఉండాలని నేను కోరుకుంటున్నాను, నా భర్తకు విడాకులు ఇవ్వడానికి నేను సిద్ధం” అని స్పష్టం చేసింది.
స్టేషన్ హౌస్ ఆఫీసర్ రవి శ్రీవాస్తవ మాట్లాడుతూ.. హోటల్లో గొడవ జరుగుతున్నట్లు సమాచారం రావడంతో ముగ్గురినీ స్టేషన్‌కు తరలించామని, అందరి స్టేట్మెంట్లు తీసుకున్నామని తెలిపారు. భర్త ఇచ్చిన ఫిర్యాదు మేరకు చట్టపరమైన విచారణ జరుగుతోందని పేర్కొన్నారు.
