₹5 లక్షలైనా, ₹50 లక్షలైనా.. ఈ 10 రకాల ఆదాయాలపై ఒక్క రూపాయి కూడా పన్ను పడదు!

భారతదేశంలో 10 రకాల ప్రత్యేక ఆదాయాలను ఆదాయపు పన్ను శాఖ (Income Tax Department) ‘పన్ను రహిత’ (Tax-Free) కేటగిరీలో ఉంచింది. మీరు ఈ మార్గాల ద్వారా ఎంత సంపాదించినా ప్రభుత్వం పన్ను అడగదు.

వ్యవసాయం మరియు వారసత్వ ఆస్తులపై మినహాయింపు: టాక్స్ ఫ్రీ ఆదాయాల జాబితాలో మొదటిది వ్యవసాయ ఆదాయం (Agricultural Income). భారత్ వ్యవసాయ ప్రధాన దేశం కావడంతో సాగు ద్వారా వచ్చే నికర ఆదాయంపై పన్ను ఉండదు. అలాగే, తల్లిదండ్రులు లేదా పూర్వీకుల నుండి వారసత్వంగా (Inheritance) వచ్చే ఆస్తి, నగలు లేదా నగదుపై కూడా పన్ను లేదు. అయితే, ఆ ఆస్తిని భవిష్యత్తులో విక్రయించినప్పుడు వచ్చే లాభంపై ‘క్యాపిటల్ గెయిన్ టాక్స్’ పడుతుంది. వీటితో పాటు పెళ్లిళ్లలో బంధుమిత్రుల నుండి వచ్చే బహుమతులు (Gifts) కూడా కొన్ని నిబంధనల మేరకు పన్ను రహితమే.

పన్ను పడని ఆ 10 రకాల ఆదాయాలు ఇవే:
  1. వ్యవసాయ ఆదాయం: సాగు ద్వారా వచ్చే ఆదాయంపై పన్ను ఉండదు.
  2. పబ్లిక్ ప్రావిడెంట్ ఫండ్ (PPF): పిపిఎఫ్ లో వచ్చే వడ్డీ మరియు మెచ్యూరిటీ మొత్తంపై పన్ను లేదు. సెక్షన్ 80C కింద ఏడాదికి ₹1.5 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు.
  3. EPF విత్ డ్రాయల్: ఒకే చోట వరుసగా 5 ఏళ్ల పాటు ఉద్యోగం చేసిన తర్వాత ఈపీఎఫ్ నుండి తీసే సొమ్ముపై పన్ను ఉండదు.
  4. లైఫ్ ఇన్సూరెన్స్ మెచ్యూరిటీ: బీమా పాలసీ మెచ్యూరిటీ సొమ్ము లేదా మరణానంతరం వచ్చే క్లెయిమ్ పై పన్ను ఉండదు (ప్రీమియం మొత్తం సమ్ అష్యూర్డ్ లో 10% మించకూడదు).
  5. స్కాలర్‌షిప్: విద్యార్థులకు విద్యాభ్యాసం కోసం వచ్చే ఎటువంటి ఉపకార వేతనాల పైనా పన్ను పడదు.
  6. బహుమతులు (Gifts): రక్త సంబంధీకుల నుండి వచ్చే బహుమతులకు పన్ను లేదు. ఇతరుల నుండి వచ్చే ₹50,000 లోపు బహుమతులు పన్ను రహితం.
  7. వారసత్వ ఆస్తి: వీలునామా లేదా వారసత్వంగా లభించే ఆస్తులపై పన్ను లేదు.
  8. సుకున్య సమృద్ధి యోజన (SSY): ఆడపిల్లల కోసం చేసే ఈ పథకంలో వచ్చే వడ్డీ మరియు మెచ్యూరిటీ సొమ్ము రెండూ పన్ను రహితమే.
  9. టాక్స్-ఫ్రీ బాండ్లు: ప్రభుత్వ సంస్థలు జారీ చేసే ప్రత్యేక బాండ్ల నుండి వచ్చే వార్షిక వడ్డీపై పన్ను ఉండదు.
  10. గ్రాట్యుటీ (Gratuity): ప్రభుత్వ ఉద్యోగులకు వచ్చే పూర్తి గ్రాట్యుటీ పన్ను రహితం. ప్రైవేట్ ఉద్యోగులకు ₹20 లక్షల వరకు మినహాయింపు ఉంది.

Posted

in

by

Tags: