అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పిన స్కూల్ బస్సు. గోడను బద్దలుకొట్టుకుని ఆశ్రమంలోకి దూసుకెళ్లిన భయానక ఘటన.! బస్సులో హాహాకారాలు చేసిన విద్యార్థులు. అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడిన చిన్నారులు.!!

ఉత్తరాఖండ్ రాష్ట్రం రిషికేష్‌కు, ఉత్తరప్రదేశ్ లోని ఫిరోజాబాద్ ప్రాంతానికి చెందిన పండిట్ తిలక్ భాను హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థులు, ఉపాధ్యాయులు విద్యా విహారయాత్రకు (ఎడ్యుకేషనల్ టూర్) వెళ్లారు.

బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని వారు ఈ టూర్‌కు వెళ్లగా, శనివారం ఉదయం సుమారు 9.30 గంటల సమయంలో ముని కీ రేతి (Muni Ki Reti) ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.

విద్యార్థులు, ఉపాధ్యాయులతో వెళ్తున్న బస్సు పబ్లిక్ వర్క్స్ డిపార్ట్‌మెంట్ (PWD) జంక్షన్ దగ్గరకు రాగానే అకస్మాత్తుగా బ్రేకులు ఫెయిల్ అయినట్లు తెలుస్తోంది. దీంతో డ్రైవర్ నియంత్రణ కోల్పోయిన బస్సు.. రోడ్డు పక్కనే ఉన్న ఆశ్రమం గోడను బలంగా ఢీకొట్టింది. గోడను బద్దలుకొట్టుకుని బస్సు ఏకంగా ఆశ్రమ ప్రాంగణంలోకి చొరబడింది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న పోలీసులు, రాష్ట్ర విపత్తు ప్రతిస్పందన దళం (SDRF) సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. బస్సులో ఉన్న విద్యార్థులు, ఉపాధ్యాయులందరినీ సురక్షితంగా బయటకు తీసుకొచ్చారు. ఈ ప్రమాదంలో డ్రైవర్ జయప్రకాష్, హెల్పర్ అవధేష్, పాఠశాల ప్రిన్సిపాల్ రజినీ సరస్వత్ ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. వారిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, ప్రథమ చికిత్స అందించిన అనంతరం పంపించివేశారు.

ఆ తర్వాత, విద్యార్థుల భద్రతను దృష్టిలో ఉంచుకుని వారికి మధుబన్ ఆశ్రమంలో బస, భోజన సదుపాయాలు ఏర్పాటు చేశారు. ప్రాథమిక విచారణలో బస్సు బ్రేకులు ఫెయిల్ కావడమే ఈ ప్రమాదానికి కారణం కావచ్చని పోలీసులు తెలిపారు. అయితే, ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తిస్థాయి విచారణ కొనసాగుతోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *