అత్యంత భయానకం.! కారులో సీఎన్‌జీ (CNG) గ్యాస్ నింపుతుండగా భారీ శబ్దంతో అగ్నిపర్వతంలా పేలిపోయిన కారు.. ట్యాంక్ నిండగానే జరిగిన విపరీతం. సంచలన వీడియో..!

గుజరాత్‌లోని వడోదర జిల్లా కర్జాన్ సమీపంలో జాతీయ రహదారి-48పై ఉన్న ఓ సీఎన్‌జీ ఫిల్లింగ్ స్టేషన్‌లో, ఓ కారులో ఇంధనం నింపుతుండగా అది అకస్మాత్తుగా భారీ శబ్దంతో పేలిపోవడం ఆ ప్రాంతంలో తీవ్ర కలకలం రేపింది.

అక్టోబర్ 1వ తేదీన, జాతీయ రహదారిపై జిందాల్ కంపెనీకి ఎదురుగా ఉన్న సీఎన్‌జీ బంక్‌కు ఓ కారు ఇంధనం నింపుకునేందుకు వచ్చింది. కారులో సీఎన్‌జీ గ్యాస్ నింపుతున్న సమయంలోనే, ఊహించని విధంగా కారు ఫ్యూయల్ ట్యాంక్ భారీ శబ్దంతో పేలిపోయింది.

ఈ పేలుడు తీవ్రతకు కారు వెనుక భాగం నుజ్జునుజ్జయ్యింది. కారు అద్దాలు, విడిభాగాలు పలు మీటర్ల దూరం ఎగిరిపడ్డాయి. అంతేకాకుండా, పక్కనే ఆపి ఉంచిన మరో రెండు వాహనాలు కూడా ఈ ప్రమాదంలో ధ్వంసమయ్యాయి.

ఇంధనం నింపే సమయంలో కారులో ప్రయాణికులు కానీ, డ్రైవర్ కానీ ఎవరూ లేకపోవడంతో అదృష్టవశాత్తూ పెను ప్రమాదం తప్పింది. ఎలాంటి ప్రాణనష్టం లేదా గాయాలు లేకుండా అందరూ సురక్షితంగా బయటపడ్డారు.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న వెంటనే, అగ్నిమాపక సిబ్బంది, స్థానిక పోలీసులు హుటాహుటిన అక్కడికి చేరుకుని తగిన భద్రతా చర్యలు చేపట్టి పరిస్థితిని అదుపులోకి తెచ్చారు.

ఇంధనం నింపుతున్న సమయంలో సీఎన్‌జీ ట్యాంక్ పేలడమే ఈ ప్రమాదానికి కారణమని ప్రాథమిక నివేదికలు తెలిపాయి. అయితే, ట్యాంక్ పేలడానికి కచ్చితమైన కారణం ఏంటి? సాంకేతిక లోపమా లేక మరేదైనా కారణమా అనే కోణంలో పోలీసులు, అధికారులు తీవ్రంగా దర్యాప్తు చేస్తున్నారు.


Posted

in

by

Tags: