“అది కూడా ఒక ప్రాణమే కదా”.? “కోతికి డప్పు వాయిద్యాల మధ్య ఘనంగా అంత్యక్రియలు”. ఊర్లో తిరుగుతుండేది పాపం చనిపోయింది.. ఆవేదనతో తీసుకున్న నిర్ణయం. హృదయాన్ని హత్తుకునే వీడియో.!

రాజస్థాన్ రాష్ట్రం జోధ్‌పూర్‌లో విద్యుదాఘాతానికి (కరెంట్ షాక్) గురై మరణించిన ఒక కోతికి, స్థానిక ప్రజలు మనుషులకు చేసినట్లే సంప్రదాయబద్ధంగా అంత్యక్రియలు నిర్వహించి, అంతిమ యాత్ర జరిపిన భావోద్వేగ ఘటన అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది.

జోధ్‌పూర్ ప్రాంతంలోని ఓ బావికి సమీపంలో తిరుగుతున్న కోతి, అనుకోకుండా అక్కడున్న విద్యుత్ తీగకు చిక్కుకుని కరెంట్ షాక్ కొట్టి పరితాపకరంగా మృత్యువాత పడింది.

ఈ విషయం తెలుసుకున్న ఆ ప్రాంతానికి చెందిన సామాజిక కార్యకర్తలు, ప్రజలు మృతి చెందిన కోతి మృతదేహాన్ని చూసి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. జంతువనే వివక్ష లేకుండా, ఆ కోతికి తగిన గౌరవంతో అంత్యక్రియలు నిర్వహించాలని వారు నిర్ణయించారు. దీంతో ఊరి జనం అంతా ఏకమై అంతిమ యాత్రకు ఏర్పాట్లు ప్రారంభించారు.

అంత్యక్రియలకు ముందు, మరణించిన కోతి మృతదేహానికి సంప్రదాయబద్ధంగా పుణ్యస్నానం చేయించి, పూల దండలు వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత డప్పు వాయిద్యాల మధ్య ఆ ప్రాంతంలోని ప్రధాన వీధుల గుండా కోతి మృతదేహాన్ని అంతిమ యాత్రగా తీసుకెళ్లారు. ఇందులో పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొని తమ ఘన నివాళులు అర్పించారు.

ఊరేగింపు చివరలో, స్మశానవాటికకు తీసుకెళ్లిన కోతి మృతదేహానికి అన్ని అంత్యక్రియలు శాస్త్రోక్తంగా నిర్వహించి దహన సంస్కారాలు పూర్తి చేశారు. మూగజీవి అయిన కోతికి ప్రజలు మానవత్వంతో చూపిన ఈ ప్రేమ, గౌరవం ఆ ప్రాంతంలో తీవ్ర భావోద్వేగాన్ని నింపడమే కాకుండా, నెట్టింట పలువురి ప్రశంసలు అందుకుంటోంది.


Posted

in

by

Tags:

Comments

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *