అమెరికాకు చెందిన న్యాయశాస్త్ర ప్రొఫెసర్ విలియం బాడ్ (William Baude) కు చెందిన ఏడాది కాలపు లెక్చర్ నోట్స్‌ను ప్రముఖ ‘క్లాడ్ ఏఐ’ (Claude AI) చాట్‌బాట్ మొత్తంగా తొలగించిన విచిత్ర ఘటన ప్రపంచవ్యాప్తంగా తీవ్ర ఆశ్చర్యాన్ని రేకెత్తించింది. తన లెక్చర్ నోట్స్‌ను పేజీ నంబర్ల ఆధారంగా క్రమబద్ధీకరించి ఇవ్వమని కోరుతూ ఆయన వాటిని ఏఐ ప్లాట్‌ఫారమ్‌లో అప్‌లోడ్ చేశారు. కానీ, ఆ ఏఐ చాట్‌బాట్ ఫైల్స్‌ను పేర్చడానికి బదులుగా, ఆయన ఏడాది కాలపు లెక్చర్ నోట్స్‌ను డేటాబేస్ నుంచి పూర్తిగా తుడిచేసింది.
తన తప్పు వల్లే ఫైల్స్ తొలగించబడ్డాయని గ్రహించిన ఆ ఏఐ చాట్‌బాట్.. పొరపాటున డేటాను తొలగించినట్లు అంగీకరించి యూజర్‌కు క్షమాపణలు కూడా చెప్పింది. అదృష్టవశాత్తూ, ప్రొఫెసర్ విలియం బాడ్ తన నోట్స్‌ను ముందే విడిగా ఒక బ్యాకప్ కాపీగా (Backup copy) భద్రపరుచుకోవడం వల్ల, ఆయన ఏడాది కాలపు కష్టం వృథా కాకుండా తృటిలో తప్పింది.
ఈ ఘటనపై స్పందించిన ప్రొఫెసర్.. కృత్రిమ మేధస్సు (AI) చాట్‌బాట్‌ల పనితీరు కొన్నిసార్లు ఊహించని విధంగా వికటిస్తుందని, కాబట్టి వినియోగదారులంతా అత్యంత అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఏఐ సాంకేతికతను పూర్తిగా నమ్మి ముఖ్యమైన ఫైల్స్‌ను నిర్వహించేటప్పుడు తప్పనిసరిగా బ్యాకప్ కాపీలను ఉంచుకోవడం చాలా అవసరమని ఈ ఘటన ప్రపంచానికి మరోసారి చాటిచెప్పింది.

Leave a Reply