అనవసరంగా భయపడకండి… 40 ఏళ్లు దాటిన వారికి షుగర్ ఇంత ఉండవచ్చు!

నేడు ప్రతి ఇంట్లోనూ చక్కెర వ్యాధి (డయాబెటిస్) సాధారణమైపోయింది. అయితే రక్తంలో చక్కెర స్థాయి ఎంత ఉండాలనే విషయంలో చాలా మందిలో గందరగోళం ఉంది. అమెరికన్ డయాబెటిస్ అసోసియేషన్ (ADA) 2025 మార్గదర్శకాల ప్రకారం, వయస్సు మరియు ఆరోగ్య పరిస్థితిని బట్టి ఉండాల్సిన సురక్షితమైన చక్కెర స్థాయిలు ఇక్కడ ఉన్నాయి:

యవ్వనంలో ఉన్నవారు మరియు గర్భిణీలు:

  • టీనేజర్లు: భోజనానికి ముందు 90 నుండి 130 మధ్య ఉండాలి. మూడు నెలల సగటు (HbA1c) 7 శాతం కంటే తక్కువగా ఉండటం మంచిది.
  • 18 ఏళ్లు దాటిన యువకులు: భోజనం చేసిన రెండు గంటల తర్వాత చక్కెర స్థాయి 180 మించకుండా చూసుకోవాలి.
  • గర్భిణీలు: వీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. పరగడుపున (Fasting) 95 కంటే తక్కువ, తిన్న గంట తర్వాత 140 కంటే తక్కువ, రెండు గంటల తర్వాత 120 కంటే తక్కువగా ఉండాలి.

మధ్య వయస్కులు (40 – 50 ఏళ్లు): ఈ వయస్సులో శరీర అవయవాల పనితీరు తగ్గడం ప్రారంభమవుతుంది. వీరికి భోజనం తర్వాత 140 కంటే తక్కువ, రాత్రి భోజనం తర్వాత 150 కంటే తక్కువగా ఉండాలి. ఈ పరిమితి దాటితే వైద్యుడిని సంప్రదించాలి.

వృద్ధులు (65 ఏళ్లు పైబడిన వారు): వృద్ధుల్లో చక్కెర స్థాయిలు పెరగడం కంటే, మరీ తగ్గిపోవడం (Hypoglycemia) ప్రమాదకరం. అందుకే వీరికి కొంత సడలింపు ఉంటుంది. వీరి మూడు నెలల సగటు (HbA1c) 8 శాతం వరకు ఉండవచ్చు. ఇతర ఆరోగ్య సమస్యలు లేని వృద్ధులకు ఇది 7.5 వరకు ఉండవచ్చు.

నిజమైన కొలమానం ఏది? రోజువారీ పరీక్షల కంటే, మూడు నెలల సగటును తెలిపే HbA1c పరీక్షే మీ ఆరోగ్య స్థితిని సరిగ్గా చూపిస్తుంది. మందుల కంటే ఆహార నియంత్రణ, నడక, యోగా చక్కెరను తగ్గించే మంత్రదండాలు. తెల్ల చక్కెర, ఉప్పు, శీతల పానీయాలకు దూరంగా ఉండాలి. ప్లేటులో అన్నం తగ్గించి పచ్చని కూరగాయలు, ఆకుకూరలు ఎక్కువగా తీసుకోవాలి.


Posted

in

by

Tags: