ఢిల్లీలో ఒక భయంకరమైన ఘటన వెలుగులోకి వచ్చింది. తన భార్యకు అత్యంత సన్నిహితుడైన ఒక యువకుడిని, అనుమానంతో భర్త ప్రాణాలతో తీశాడు. తన భార్యకు ఆ యువకుడితో అక్రమ సంబంధం ఉందని నిందితుడు అనుమానించాడు. ప్రస్తుతం పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
వివరాల్లోకి వెళ్తే: ఢిల్లీలోని నార్త్-ఈస్ట్ జిల్లా గోకుల్పురిలో అక్రమ సంబంధం ఉందనే అనుమానంతో 42 ఏళ్ల గౌరీ శంకర్ యాదవ్ అనే వ్యక్తి, తన భార్య స్నేహితుడైన రవికుమార్ (28)ను కొట్టి చంపాడు. నిందితుడి భార్య (35) తెలిపిన వివరాల ప్రకారం.. సుమారు 10 నెలల క్రితం తన భర్త గౌరీ శంకర్ అనారోగ్యంతో ఆసుపత్రిలో ఉన్నప్పుడు, రవి ఆమెకు అండగా నిలిచాడు. కుటుంబ అవసరాలను తీర్చడమే కాకుండా, పిల్లల పోషణ కోసం ఆమె ఒక ఫుడ్ స్టాల్ పెట్టుకోవడానికి కూడా సహాయం చేశాడు.
ఇటీవలే నివసించడానికి ఇబ్బంది కలిగితే, రవి ఆమెకు ఒక అద్దె గదిని కూడా ఇప్పించాడు. అయితే ఫిబ్రవరి 6న గౌరీ శంకర్ సూరత్ నుండి తిరిగి వచ్చాడు. ఇంట్లో రవి ఉండటం చూసి తట్టుకోలేకపోయాడు. వీరిద్దరి మధ్య అక్రమ సంబంధం ఉందని గొడవ మొదలుపెట్టాడు.
ఫిబ్రవరి 7 రాత్రి గొడవ పెద్దది కావడంతో, రవిని పైన మేడపై పడుకోమని ఆమె పంపించింది. మరుసటి రోజు ఉదయం వెళ్లి చూడగా, రవి రక్తపు మడుగులో పడి ఉన్నాడు. నిందితుడు కర్రతో రవి తలపై బలంగా కొట్టడంతో అతను మరణించాడు. పోలీసులు నిందితుడిని అరెస్ట్ చేసి జైలుకు పంపారు.
